Adipurush Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. ఆధునిక రామాయణం ఎలా ఉందంటే..?

Adipurush Movie Review in Telugu: ప్రభాస్, కృతి సనన్ జంటగా.. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఆదిపురుష్. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు (జూన్ 16) ఆడియన్స్ ముందుకు వచ్చింది. రివ్యూ ఎలా ఉందంటే..?  

Written by - Ashok Krindinti | Last Updated : Jun 16, 2023, 02:03 PM IST
Adipurush Review: ఆదిపురుష్ మూవీ రివ్యూ.. ఆధునిక రామాయణం ఎలా ఉందంటే..?

Adipurush Movie Review in Telugu: భారతీయ సంస్కృతికి అద్దంపట్టే రామాయణం మహాకావ్యంపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. వాల్కీకి రచించిన ఇతిహాసగాథను ఆదర్శంగా తీసుకుని.. రామయణంలోని అనేక ఘట్టాలను ప్రేక్షకుల ముందు ఆవిష్కరించారు. అయితే నేటి తరానికి ఈ అద్భుత కావ్యాన్ని సరికొత్తగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నాడు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాఘవుడిగా, కృతిసనన్‌ జానకీ దేవిగా పరిచయం చేస్తూ.. తెరకెక్కించిన మూవీ ఆదిపురుష్. పాన్‌ఇండియా లెవల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆదిపురుష్ ఎలా ఉంది..? రాఘవుడి పాత్రలో ప్రభాస్ ఎలా యాక్ట్ చేశాడు..? బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ ఖాతాలో హిట్ పడిందా..? అందరికీ తెలిసిన రామాయణ గాథను ఓం రౌత్ తెరపై ఎలా చూపించారు..? 

కథ ఏంటి..?
 
వాల్మీకి ర‌చించిన ఇతిహాసం రామాయ‌ణంలోని ప్రధాన ఘట్టాలను ఆధారంగా తీసుకుని డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించారు. అరణ్యకాండం ఘట్టం ప్రధానం అంశంగా.. రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుంచి క‌థ మొదలవుతుంది. జానకీ దేవి (కృతి సనన్), శేషు (సన్నీ సింగ్)తో కలిసి వనవసానికి వెళతాడు. అక్కడ లంకేశ్వరుడు (సైఫ్ అలీఖాన్) మాటలు విని.. జానకిని అపహరిస్తాడు. ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లి అశోకవనంలో బంధిస్తాడు. లంకేశ్వరుడి వద్ద జానకీదేవి ఉందని తెలుసుకున్న రాముడు కాపాడేందుకు ఏం చేశాడు..? హనుమంతుడు ఎలా సాయపడ్డాడు..? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..? అనేదే మిగిలిన కథ.  

ఎలా ఉంది..?
 
ప్రస్తుతం ఆడియన్స్‌ సినిమాను చూసే కోణంలో అనేక మార్పులు వచ్చాయి. సీట్లో కూర్చున్నంతసేపు తమను తాము మైమరిపించే విజువ‌ల్స్‌,  అబ్బుర ప‌రిచేలా గ్రాఫిక్స్ హంగులు ఉండాలని కోరుకుంటున్నారు. సూప‌ర్ శ‌క్తుల‌తో కూడిన క్యారెక్టర్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్టు రామాయణంలోని కీలక ఘట్టాలను తీసుకుని.. ఆదిపురుష్‌ సినిమాను ఓం రౌత్ రూపొందించారు. లంకేశ్వరుడు దీక్షను మెచ్చిన బ్ర‌హ్మ.. వరాలు ఇవ్వడం నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. అందరికీ తెలిసిన కథే అయినా.. విజువల్ వండర్‌గా కట్టిపడేశారు ఓం రౌత్. లంకను స్క్రీన్‌పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు. హాలీవుడ్ సినిమాల స్పూర్తి విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. 

అయితే విజువ‌ల్స్‌పై ఎక్కువ‌గా దృష్టి పెట్టడంతో భావోద్వేగాలపై శ్రద్ద పెట్టలేదనిపిస్తుంది. చివర్లో రాముడు, సీత కలుసుకున్న సందర్భంలో ఎలాంటి భావోద్వేగ సంబంధ ఉండకపోవడం సగటు ప్రేక్షకుడిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే అనేక ఊహించని సీన్లు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. మొదటి భాగం పాత్రల చూపిస్తూ సాగితే.. సెకండాఫ్‌ పూర్తిగా మరో జోన్‌లో ఉంటుంది. రాఘవుడు వానర‌సైన్యాన్ని సిద్ధం చేయ‌డం.. లంకేశ్వరుడిపై పోరుకు సైన్యంలో స్ఫూర్తిని నింపే ఘ‌ట్టాలు హీరోయిజం హైలెట్ అవుతుంది.  వార్ సీన్స్ చాలాసేపు సాగినా.. విజువల్స్ మినహా మిగిలిన అంశాలేవీ కనిపించవు. ప్రస్తుతం తర ఆడియన్స్‌ రుచికి తగినవిధంగా.. చిన్నారులను సైతం అల‌రించే విజువ‌ల్స్‌తో డైరెక్టర్ డిజైన్ చేశారు.  

ఎవరు ఎలా చేశారు..?

రాఘవుడి పాత్రలో ప్రభాస్ ఒదిగిపోయి నటించాడు. కళ్లలోనే అమాయకత్వం.. ప్రశాంతతను చక్కగా ప్రదర్శించాడు. ప్రభాస్ లుక్స్ అభిమానులకు కొత్తగా అనిపిస్తాయి. ప్రభాస్ యాక్టింగ్‌కు మార్కులు పడే సీన్‌ ఒక్కటి కూడా లేవని చెప్పవచ్చు. జానకీదేవిగా కృతి సనన్ మెప్పించింది. తెరపై పెద్దగా ప్రధాన్యం లేకపోయినా.. ఉన్న పరిధిలో చాలా హుందాగా.. అందంగా క‌నిపించింది. తనదైన ముద్రవేసేందుకు పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. లంకేశ్వరుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ మంచి అభినయం ప్రదర్శించినా.. తెరపై పెద్దగా ఆసక్తిగా కనిపించదు. లంకేశ్వరుడి వేషధారణ మరీ ఆధునికంగా ఉండడంతోపాటు అక్కడక్కడ అతని చేష్టలు చికాకు కలిగించడం నిరాశకు గురిచేస్తుంది. అయితే క్లైమాక్స్‌ సీన్స్‌లో సైఫ్ నటన మెప్పిస్తుంది. ఇతర పాత్రధారులు తమ పరిధి మేరకు యాక్ట్ చేశారు.

సాంకేతికపరంగా ఆదిపురుష్ సినిమా అత్యున్న‌త స్థాయిలో కనిపిస్తుంది. విజువ‌ల్ వండర్ సీన్స్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తాయి.  కెమెరా, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాలు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచింది. సాంగ్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అజ‌య్-అతుల్‌ బాణీలను చక్కగా సమకూర్చగా.. సంచిత్, అంకిత్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపాడేసింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. రామాయణాన్ని నేటి తరానికి తగినట్లు డిజైన్ చేయడంలో డైరెక్టర్ ఓం రౌత్ సక్సెస్ అయ్యాడు. 

ప్లస్ పాయింట్స్ 

==> విజువ‌ల్స్‌ కట్టిపాడేస్తాయి.
==> ప్రభాస్ ఎంట్రీ సీన్ 
==> సంగీతం, బీజీఎం
మైనస్ పాయింట్స్
==> రన్‌టైమ్ ఎక్కువగా ఉండడం
==> భావోద్వేగాలు మిస్ అయ్యాయి
==> సీన్లు ముందే ఊహించడం
==> వీఎఫ్‌ఎక్స్ 

రేటింగ్: 2.5/5

Also Read: Adipurush Twitter Review: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ.. ఆడియన్స్ రియాక్షన్ ఇదే..  

Also Read: TS Gurukul Recruitment 2023: అభ్యర్థులకు ముఖ్యగమనిక.. 9,231 ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు ఎప్పుడంటే..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News