Tirupati Capital: మిగతావేవీ వద్దు.. ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రాజధాని చేయాల్సిందే!
Chinta Mohan: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మరో డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇన్నాళ్లు మూడు రాజధానులపై చర్చ జరుగుతుండగా తాజాగా తిరుపతిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు.
AP Capital Tirupati: ఏపీ రాజధాని విషయంలో ఇంకా రచ్చ జరుగుతోంది. అధికార పార్టీ మూడు రాజధానులపై పట్టుబడుతుండగా.. ప్రతిపక్షాలు మాత్రం అమరావతి కొనసాగించాలని కోరుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ మాత్రం అవన్నీ కాదని తిరుపతిని రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిని రాజధాని అవుతుందని ఆనాడే వీరబ్రహ్మేంద స్వామి చెప్పినట్లు తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఏపీకి రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని కోరారు.
Also Read: Exam Forgot: మీ మతిమరుపు తగిలెయ్య.. హాల్ టికెట్లు ఇచ్చి పరీక్ష మరిచిన యూనివర్సిటీ
ఢిల్లీలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏపీ పరిణామాలపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాజధాని అంశంపై మాట్లాడారు. '70 ఏళ్ల కిందట మద్రాస్ నుంచి ఆంధ్ర ప్రాంతం విభజన జరిగితే ఆనాడు ఆచార్య ఎన్జీ రంగా తిరుపతిని రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు. కానీ సంజీవ రెడ్డి రాజధానిని కర్నూల్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మార్చారు. 50 ఏళ్లలో ఐదు సార్లు ఏపీ రాజధాని మారింది' అని గుర్తు చేశారు. కానీ ఏపీ రాజధానిగా తిరుపతి ఉండాలని పేర్కొన్నారు.
Also Read: NIA Reward: బాంబ్ పెట్టినోడిని పట్టిస్తే అక్షరాల రూ.10 లక్షల నగదు బహుమతి మీ సొంతం
'తిరుపతి రాజధానిగా ఉంటే అన్ని వర్గాలకు మేలు జరుగుతుంది. తిరుపతిలోని ఏర్పేడు నుంచి రాపూర్ వరకు లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. అక్కడ రైతులకు పరిహారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కండలేరుతో నీటికి కొదవ ఉండదు. హైదరాబాద్ కంటే తిరుపతిలో మంచి వాతావరణం ఉంటుంది. ఏడు విశ్వవిద్యాలయాలు, ఏడు జాతీయ రహదారులతో తిరుపతిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి.
రాయలసీమ ప్రాంతంలో పరిస్థితులపై చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'రాయలసీమ వెనుకబడిన ప్రాంత రైతుల కష్టాలు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. సీమకు గోదావరి, కృష్ణా నీళ్లు ప్రతిపాదనల్లో ఉన్నా చుక్క రాలేదు. సీమ యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బీటెక్ పాసయ్యి బ్రాందీ షాపుల్లో పని చేస్తున్నారు' అని తెలిపారు. రాయలసీమ సమస్యలు పరిష్కారం కావాలంటే దానికి తిరుపతిని రాజధానిని చేయడమే పరిష్కారం అని స్పష్టం చేశారు. తిరుపతి రాజధాని కావాలనేది 70 ఏళ్ల నాటి ప్రతిపాదన అని గుర్తుచేశారు. తెలంగాణ విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తిరుపతిని రాజధానిగా చేయాలని కోరినట్లు తెలిపారు. తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు 300 ఏళ్ల కిందటే చెప్పారని వివరించారు. బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరిగాయని, తిరుపతి రాజధాని కూడా జరుగుతుందని జోష్యం చెప్పారు.
పదేళ్ల పాటు చింతా మోహన్ తిరుపతి ఎంపీగా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా తిరుపతిని రాజధానిగా చేయాలని మొదటి నుంచి చింతా మోహన్ డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి రాజధాని ఉద్యమాన్ని ఆయన నడిపిస్తున్నారు. ఇదే డిమాండ్‌తో చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. త్వరలోనే ఇదే డిమాండ్‌తో ఉద్యమాలు చేసేందుకు సిద్ధమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter