వివాహ వేడుకకు హాజరై వెళ్తుండగా విషాదం
వివాహ వేడుకకు హాజరై తిరుగు వెళ్తుండగా విషాదం చోటుచేసుకుంది. ఆటో బోల్తా పడటంతో నలుగురు మృతిచెందారు.
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలకు హాజరై వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. మృతులలో తండ్రీకొడుకులు ఉండటం గమనార్హం. ఆ వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలి కొత్తకొటకు చెందిన కొందరు నరసన్నపేటలో తమ బంధువుల ఇంట్లో పెళ్లికి హాజరయ్యారు. శనివారం రాత్రి వివాహ వేడుకల నుంచి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు.
See Photos: అందమైన భామలు.. లేత మెరుపు తీగలు
కాగా, బైరికూడలి వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తోన్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా, ఒకరు చికిత్స పొందుతూ చనిపోయాడు. తండ్రీకొడుకులు వెంకటి, సింహాచలం, శ్రీలత అనే మహిళ ఘటనా స్థలంలోనే చనిపోగా, ఈ ఘటనలో గాయపడ్డ 8 మందిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో గణేష్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని క్రైమ్ కథనాల కోసం క్లిక్ చేయండి