Vallabhaneni Vamsi: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత.. పంజాబ్‌లోని ఆస్పత్రికి తరలింపు!
Gannavaram MLA Vallabhaneni Vamsi Admitted To Mohali Hospital. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Gannavaram MLA Vallabhaneni Vamsi Admitted To Mohali Hospital: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. మరో 1-2 రోజుల్లో వల్లభనేని వంశీని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు చెప్పారు. ఆయనకు ఎడమ చేయి విపరీతంగా లాగినట్లు అనిపిస్తుండటంతో ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం తెలిసింది.
ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా వల్లభనేని వంశీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఎన్నికల్లో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదిలా ఉంటే.. ప్రతిష్టాత్మక ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) హైదరాబాద్‌లో గత సంవత్సరం వంశీ సీటు సాధించారు. అడ్వాన్స్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) కోర్సు చేస్తున్నారు. ప్రస్తుతం మూడో సెమిస్టర్ తరగతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుంచి పంజాబ్‌లోని మొహాలీ క్యాంపస్‌లో ఆయన తరగతులకు హాజరవుతున్నారు.
మంగళవారం (జూన్ 21) క్లాస్‌కు వెళ్లిన వల్లభనేని వంశీకి ఎడమ చేయి లాగినట్లు అనిపిస్తుండటంతో.. మొహాలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులు పంజాబ్ వెళ్లారని సమాచారం తెలుస్తోంది.
Also Read: AP Inter Results 2022: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
Also Read: Vijayakanth Toes: సీనియర్ హీరో విజయకాంత్‌కు అనారోగ్యం.. మూడు వేళ్ల తొలగింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.