AP Assembly Election 2024: వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. మార్కాపురం లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన..  తన ఆరోగ్య కారణాల కారణంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు. తాను వైసీపీలో కొనసాగతానని.. పార్టీ మారుతున్న జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. తనపై కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులతో మొదటి సారి తాను ఎమ్మెల్యే అయ్యానని గుర్తు చేసుకున్నారు. తనను తన కుటుంబాన్ని కొందరు టార్గెట్ చేసి కించపరుస్తూ కులం పేరుతో కూడా దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాను డబ్బుకు తీసుకొని రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే అన్నా. జిల్లా రాజకీయ పెద్దలు కూడా పట్టి పట్టనట్లు ఉన్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో తాను పోటీ చేయనని జగన్ వద్ద చెప్పానని.. కానీ ఆయన ఒప్పుకోలేదన్నారు. జగన్‌తోనే తన రాజకీయ ప్రయాణం కొనసాగుతుందన్నారు. గిద్దలూరు నుంచి ఎవరు పోటీ చేసినా.. వైసీపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పార్టీ విజయం కోసం కష్టపడాలని సూచించారు. 


సీఎం జగన్ బొమ్మతోటి.. గిద్దలూరు వైసీపీ పార్టీ క్యాడర్ బలంతోనే తాను 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించానని ఎమ్మెల్యే అన్నా రాంబాబు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శాయశక్తుల కృషి చేశానని అన్నారు. గిద్దలూరు టికెట్ విషయంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరుఫున ఏ నాయకుడు పోటీ చేసినా విజయం సాధిస్తారని అన్నారు. తనకు ఇటీవల ఆపరేషన్ చేశారని.. ఎక్కువ భాగం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని చెప్పారు. అందుకే తాను ఇంటి నుంచి బయటకు రావడం లేదన్నారు. మరో రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని.. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాను యాక్టివ్‌గా ఉండలేనన్నారు.


"పార్టీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అందరూ కలిసికట్టుగా పని చేద్దాం. గిద్దలూరు నియోజయకవర్గం నుంచి జగన్ మోహన్ రెడ్డి గారు ఎవరిని పోటీ చేయమని చెప్పినా.. అభ్యర్థి విజయం కోసం కృష్టి చేయండి. నేను ఓ కార్యకర్తగా పని చేస్తా. వ్యక్తిగత స్వార్థం పక్కనపెట్టి.. పార్టీ అభివృద్ధి కోసం పాటుపడండి." అని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. అయితే జిల్లా నాయకులు తనను పట్టించుకోకుండా చిన్న చూపు చూడడం బాధాకరంగా ఉందన్నారు. 


Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం


Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter