Godavari Floods: మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి, జలదిగ్భంధనంలో లంక గ్రామాలు
Godavari Floods: గోదావరి నది మహోగ్రరూపం దాలుస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తుతోంది.అటు భద్రాచలం ఇటు ధవళేశ్వరం రెండు చోట్లా రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ మూడో ప్రమాద హెచ్చరిక దిశగా వరద ప్రవాహం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Godavari Floods: గోదావరి నదీ పరివాహక ప్రాంతమైన మహారాష్ట్రతో పాటు ఉపనది శబరి పరివాహక ప్రాంతంలో సైతం కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది అంతకంతకూ పెరుగుతోంది. పోటెత్తుతున్న శబరి నది అదుపు తప్పితే గోదావరికి మరింత వరద పొంచి ఉంటుంది. ఇప్పటికే లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
భారీ వర్షాల కారణంగా గోదావరి నది వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 51 అడుగులకు చేరుకుని భయపెడుతోంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరో రెండు అడుగులు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. ఇక దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరుకుంది. మొత్తం 175 గేట్లను పూర్తిగా తెరిచి 13 లక్షల 75 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం వద్ద కూడా రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది.
గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం నుంచి వాజేడు వెంకటాపురానిక వెళ్లే రహదారులు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపై తూర్పు బ్లాక్ వద్ద గోదావరి నీళ్లు చేరడంతో భద్రాచాలం నుంచి కూనవరం, చింతూరు, వీఆర్ పురం వెళ్లే రహదారి పూర్తిగా ఆగిపోయింది. ఇక శబరి నది ప్రవాహం పెరిగితే పరిస్థితి మరింత ప్రమాదకరం కావచ్చు. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో పడవల్ని ఆశ్రయిస్తున్నారు. వరద మరింత పెరిగితే లంక గ్రామాల్లోకి నీరు చేరనుంది. అందుకే ఇప్పటికే కోనసీమ లంక గ్రామాల్ని అప్రమత్తం చేస్తున్నారు.
భద్రాచలం వద్ద మధ్యాహ్నానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ కావచ్చు. అయితే ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ కాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతుండటమే దీనికి కారణం.
Also read: AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook