AP DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. గడువు పొడగింపు.. వీరికి మాత్రమే ఎడిట్ ఆప్షన్..
AP DSC 2024 Extended Application Date: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 12న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. SGT, TGT,PGT, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది.
AP DSC 2024 Extended Application Date: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 12న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. SGT, TGT,PGT, ప్రిన్సిపల్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఈ నేపథ్యంలో డిస్ట్రిక్ సెలక్షన్ కమిషన్ 6,100 టీచర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దరఖాస్తుకు చివరి తేదీ 2024 ఫిబ్రవరి 22 కాగా, మరో మూడురోజులు పొడిగించి దరఖాస్తులకు చివరితేదీ 25 వరకు అవకాశం కల్పించారు.
స్కుల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ తాజా నివేదిక ప్రకారం డీఎస్సీ అభ్యర్థులకు మరో మూడు రోజుల వరకు దరఖాస్తు రుసుము చెల్లించి అప్లై చేసుకునే అవకాశం కల్పించింది.
అంతేకాదు https://apdsc.apcfss.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారు సరిచేసుకునే సదుపాయం కూడా కల్పించారు. దీనికి అదనంగా ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.. అయితే, అభ్యర్థి పేరును మార్పులు చేసే అవకాశం లేదు. అలాగే మీరు దరఖాస్తు చేసుకున్న పోస్టు, జిల్లా పేరును కూడా ఎడిట్ చేసుకునే సౌలభ్యం లేదు. ఇవి కాకుండా మిగతావి ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. పేరులో ఎవైన తప్పులు ఉంటే ఎగ్జామినేషన్ సెంటర్లో నామినల్స్ రోల్సో సిగ్నేచర్ సమయంలో కరెక్షన్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: Pawan Kalyan: నాయకులు ఖర్చు పెట్టాల్సిందే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషద్, మండల పరిషద్, మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ స్థాయిల్లో ఖాళీలను భర్తీ చేయనుంది. ఏపీ డీఎస్సీ టీచర్ నోటిఫికేషన్ 2024 డిస్ట్రిక్ సెలక్షన్ కమిషన్ నిర్వహించనుంది. దీనికి దరఖాస్తు రుసుము రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లు. కాగా, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు సడలింపు ఇచ్చారు. డీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్ష .ఎస్జీటీ పోస్టులకు పేపర్-1, స్కూల్ అసిస్టెంట్లకు పేపర్-2 విడివిడిగా నిర్వహిస్తారు.
ఇదీ చదవండి: Janasena vs Tdp: సీట్ల లెక్క తేలకుండానే నేతల మధ్య మొదలైన పంచాయితీ, రాజమండ్రి రూరల్ ఎవరికి
గత ప్రభుత్వంలో 2018లో చివరిసారిగా డీఎస్సీ నిర్వహించారు. మొత్తం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించినందున ఈ పోస్టులకు డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ మీడియంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook