చంద్రబాబు అధ్యక్షుతన ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో జర్నలిస్టులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. వారి ఇళ్ల స్థలాల కోసం రాజధాని ప్రాంతంలో 30 ఎకరాలు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.  ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున 30 ఎకరాలు కేటాయించినట్లు తెలిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ మీడియా కథనం ప్రకారం తొలివిడత సీఆర్‌డీఏకు రూ.కోటి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మొత్తం చెల్లిస్తేనే సీఆర్‌డీఏ..జర్నిలిస్టుల సొసైటీకి భూమిని కేటాయిస్తారు. కాగా మిగిలిన  మొత్తం రెండేళ్లలో చెల్లించే వెసలుబాటు కల్పిస్తోంది.


అలాగే ఎన్జీవోలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల స్థలం కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే గజానికి రూ.4 వేల చొప్పన 230 ఎకరాలు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.