Tomato Price drops:  దేశీయ మార్కెట్లో గత వారం రోజులుగా టమాటా ధరలు మండిపోతున్నాయి. కిలో టమాటా రూ. 100 నుంచి 120 వరకు పలుతోంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నడూ లేనంతగా టమాటా రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. గురువారం అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో మరింత పెరిగి రూ.124కు చేరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో పెరిగిన ధరలతో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరట కలిగించే విషయం చెప్పింది. దీంతో జగన్ సర్కారు రాయితీపై టమాటాలను విక్రయిస్తుంది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో రూ. 50కే విక్రయించేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో చాలా చోట్ల కిలో టమాటా రూ. 50 అమ్ముతుండటంతో ప్రజలు బారులు తీరుతున్నారు. 


పెరిగిన మసాలా ధరలు
మరోవైపు దేశవ్యాప్తంగా మసాలా దినుసుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో కిలో జీలకర్ర రూ.750 పలుకుతోంది. అంటే సాధారణం కంటే 300 రూపాయలు పెరిగింది. లవంగాలు అయితే కిలో రూ. 1200 పలుకుతున్నాయి. ఇది రెండు వందల రూపాయలు అదనంగా పెరిగింది. మరోవైపు అల్లం ధర కూడా రూ. 250కు ఎగబాకింది. ఒకేసారి కూరగాయలు, పప్పులు మరియు మసాలా దినుసులు ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


Also Read: Masala Price Hike: నిన్న టమాటా.. నేడు మసాలా.. కొండెక్కి కూర్చున్న ధరలు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook