Masala Price Hike: నిన్న టమాటా.. నేడు మసాలా.. కొండెక్కి కూర్చున్న ధరలు..!

Masala Price Hike: దేశంలో నిత్యం వాడే మసాలా దినుసుల ధర ఆకాశానికి చేరాయి మరి ముఖ్యంగా జీలకర్ర, లవంగాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ధరలు పెరగడానికి కారణం ఏంటో తెలుసుకుందాం   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 12:45 PM IST
Masala Price Hike: నిన్న టమాటా.. నేడు మసాలా.. కొండెక్కి కూర్చున్న ధరలు..!

Spice Prices increased: దేశంలో కూరగాయలు, టమోటాలు, పప్పుల ధరలు చుక్కలు చూపిస్తున్న తరుణంలో.. మసాలా దినుసుల ధరలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో మరోసారి సామాన్యుల గుండెల్లో రాయిపడినట్లయింది. మసాలా దినుసుల్లో జీలకర్ర రేటు విపరీతంగా పెరిగిపోయింది. కిలో జీలకర్ర ధర ఏప్రిల్ రూ.400 ఉండగా.. ఇప్పుడు రూ.750కి పెరిగింది.  అదేవిధంగా ఏప్రిల్‌లో కిలో రూ.1000 ఉన్న లవంగం ధర ఇప్పుడు రూ.1200కి ఎగబాకింది. ఇతర మసాలా దినుసులు రేట్లు కూడా అధిమయ్యాయి. 

భిఫర్ జోయ్ తుఫాన్ ప్రభావం, రవాణాకు ఆటంకం మరియు రుతపవనాలు ఆలస్యం కావడం వల్లే ఈ ధరలు పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు విత్తే సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు, అధిక వర్షపాతం కారణంగా ప్రధానంగా సాగు చేసే ప్రాంతాల్లో రైతులు ఆవాలు వంటి పంటల వైపు మళ్లారు. అతివృష్టి కారణంగా పసుపు, కారం తదితర మసాలా దినుసుల ధరలు పెరిగే అవకాశం ఉంది. 

వారం రోజులుగా కూరగాయ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. టమాటా ధర రూ.100 నుండి 120కి పెరిగింది. తెలుగు రాష్ట్రల్లో రూ. 80 నుంచి 120 వరకు పలుకుతోంది. పచ్చి మిర్చి కిలో రూ.150, అల్లం రూ.250కి ఎగబాకింది. ఈ ధరలు పెరగడం చూస్తుంటే దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు మాదిరిగా కూరగాయలు, మసాలా దినుసులు ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు కూర వండుకోలేని స్థితికి దారి తీసింది. 

Also Read: Tomato Price Hike: ఆకాశాన్నింటిన టమాటా ధరలు.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సామాన్య ప్రజలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News