Dital Pamyments in  APS RTC: పాన్ షాప్ నుంచి షాపింగ్ మాల్స్, 7 స్టార్ హోటల్స్ వరకు అన్ని డిజిటల్ మయమయ్యాయి. నగదు చెల్లింపు ప్రతిది ఇప్పుడు ఆన్‌లైన్ మహిమే. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు జనం. దేశంలో ఎక్కడ చూసిన కార్డ్ స్వైపింగ్, స్కాన్ చేసే ట్రెండ్ నడుస్తోందతి. డిజిటల్ లావాదేవీలు చేసేందుకు ప్రజలు అలవాటు పడిపోయారు. ఏపీ ఆర్టీసీ లేటెస్ట్ ట్రెండ్‌ని ఫాలో కాబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్టీసీ బస్సుల్లో కూడా డిజిటల్ పేమేంట్స్ చేసేందుకు లైన్ క్లియర్ చేస్తోంది. కార్గో సేవలతో జోష్‌లో ఉన్న ఏపీఎస్ ఆర్టీసీ మరో ప్రయోగానికి అడుగులు వేస్తోంది. బస్సుల్లో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణీకులు ఇప్పటిదాకా నగదు రూపంలో వసూలు చేసింది ఏపీఎస్ ఆర్టీసీ. బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.


యూనిఫైడ్ టికెటింగ్ సిస్టం కోసం ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే టెండర్లను నిర్వహించింది. 8 కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. అభి బస్ సంస్థ టెండర్‌ను దక్కించుకుని కాంట్రాక్ట్‌ను ఒప్పందం చేసుకుంది. యూనిఫైడ్ టికెటింగ్ సిస్టంతో కేవలం డిజిటల్ పేమెంట్ ఒక్కటే కాదు.. ఆ నంబర్ ఆధారంగా మన లైవ్ లొకేషన్ తెలుసుకోవడం.. ఆన్‌లైన్‌లో ముందుగా బుక్ చేసుకోవడం మరిన్ని సదూపాయలను కల్పిస్తున్నారు. 


యూనిఫైడ్ టికెటింగ్ సిస్టంను సిద్ధం చేసి మొట్టమొదటి సారిగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ బస్సుల్లో టికెట్స్ కోసం ఉపయోగించిన టిమ్స్ స్థానంలో యూనిఫైడ్ టికెటింగ్ సిస్టంతో రూపొందించిన ఈ-పాస్ మెషిన్లు ప్రవేశపెడతారు. బస్సు ప్రయాణంలో మనం టికెట్ తీసుకున్న తర్వాత డబ్బులు కాకుండా.. క్రెడిట్, డెటిట్ కార్డులు, గూగుల్ పే, ఫోన్ పే వంటి డిజిటిల్ యాస్స్ ద్వారా టికెట్ డబ్బును చెల్లించవచ్చు. 


ముందుగా బస్సు పాసులు, కొరియర్ సేవలు, పార్సిల్ బుకింగ్‌, టికెట్ల బుకింగ్‌లకూ కూడా డిజిటల్ పేమెంట్స్‌కు చేయడానికి అవకాశం కల్పిస్తారు. రాబోయే ఆరు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఈ-సేవలు అందుబాటులోకి తెస్తామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.


Also Read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..


Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook