Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై ఇటీవల తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు 'వై' కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. న్యాయమూర్తులను చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో.. వారికి భద్రతను పెంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం సీఎం బసవరాజ్ బొమ్మై ఒక ప్రకటన చేశారు.
'హిజాబ్ వివాదంపై తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించాం. న్యాయమూర్తులకు బెదిరింపు కాల్స్‌పై సమగ్ర విచారణ జరపాల్సిందిగా డీజీ, ఐజీలను ఆదేశించాం.' అని బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
హిజాబ్ వివాదంపై ఇటీవల కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. విద్యా సంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు.. ఇస్లాం ప్రకారం హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదని పేర్కొంది. యూనిఫాం అనేది విద్యా సంస్థల ప్రోటోకాల్ అని... యూనిఫాం ధరించమని కోరడం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు కాదని తెలిపింది. యూనిఫాం ధరించడంపై జీవో ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. హిజాబ్ నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టిపారేసింది.
హిజాబ్‌పై తీర్పు తర్వాత.. ఆ తీర్పు వెలువరించిన ముగ్గురు న్యాయమూర్తులు రితు రాజ్ అవస్తి, కృష్ణ దీక్షిత్, ఖాజీ ఎం జైబున్నీసాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటీవల మధురైలో తౌహీద్ జమాత్‌కి చెందిన కొంతమంది ముగ్గురు న్యాయమూర్తులను బెదిరింపులకు గురిచేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తులకు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Karnataka govt to provide 'Y' category security to judges who delivered hijab verdict
Read @ANI Story | https://t.co/jW183Dg1YW#HijabVerdict #KarnatakaHC pic.twitter.com/mqbNwFdbCC
— ANI Digital (@ani_digital) March 20, 2022
Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్.. స్టార్ ఆల్‌రౌండర్ దూరం!!
Also Read: రాజమౌళికి సానుభూతి ఉండదు.. ఆరోగ్యం బాగాలేకపోయినా నాతో షూటింగ్ చేపించారు! స్టార్ హీరో ఫిర్యాదు!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook