Schools Holiday: ఏపీ విద్యార్థులకు మరో సెలవు.. వరుస సెలవులతో పిల్లలు ఎంజాయ్
Andhra Pradesh Students Govt Announces Tomorrow Also Is Schools Holiday: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులకు తోడు వరుస పండుగలతో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. తాజాగా సోమవారం కూడా విద్యార్థులకు సెలవు లభించింది.
AP Schools Holiday: ఆంధ్రప్రదేశ్‌లతో తరచూ విద్యార్థులకు సెలవులు వస్తున్నాయి. ఈ నెలారంభంలో వర్షాలు, వరదల కారణంగా సెలవులు రాగా.. ఇప్పుడు పండుగల సెలవులు వస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు. విద్యాలయాలకు సెలవు రావడంతో ఆటలుపాటలతో స్నేహితులతో సరదాగా గడుపుతున్న విద్యార్థులకు మరో సెలవు లభించింది. ముస్లింల పవిత్ర దినమైన మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సెలవు ప్రకటించింది.
Also Read: YS Jagan: రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ రచ్చ.. ఏపీలో తీవ్ర దుమారం
మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు అని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ ప్రకటించింది. పాఠశాలలు తిరిగి మంగళవారం తెరచుకుంటాయని పాఠశాల విద్యా శాఖ తెలిపింది. తాజా సెలవుతో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులయ్యాయి. శనివారం రెండో శనివారం, ఆదివారం.. ఇప్పుడు సోమవారం కలిపి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో విద్యార్థులు ఎంజాయ్ చేస్తున్నారు.
Also Read: Fake News Spread: బుడమేరుకు మళ్లీ గండి వార్తలు కలకలం.. వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన
తెలంగాణలోనూ..
తెలంగాణలో కూడా మిలాద్ ఉన్ నబీకి సెలవు ప్రకటించారు. తెలంగాణ విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు కావడం గమనార్హం. రెండో శనివారం, ఆదివారంతోపాటు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా సోమవారం సెలవు వచ్చింది. ఇక గణేశ్ మహా నిమజ్జనం సందర్భంగా మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలకు తెలంగాణ విద్యా శాఖ సెలవు ప్రకటించింది. ఈ సెలవుతో కలిపితే మొత్తం నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.