AP Govt Teachers Latest News: పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజుతో జరిగిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చ జరిగింది. జీవో నంబర్ 117 రద్దుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తి అయిందని.. బేసిక్ ప్రాథమిక పాఠశాలలకు 1:20 నిష్పత్తిన ఉపాధ్యాయులను కేటాయిస్తామని తెలిపారు. ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 31 నుంచి 59 ఉన్న సందర్భంలో వాటిని మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాలలు లేని సందర్భంలో కొనసాగించేందుకు యోచన చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సర్వీసెస్ జేడీ ఏ.సుబ్బారెడ్డి, సర్వీసెస్ డీడీలు పి.శైలజ, అబ్రహం పాల్గొన్నారు. ఈ కింది అంశాలపై చర్చ జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

==> ఫౌండేషన్ స్కూల్స్ అనగా ఒకటి రెండు తరగతులు ఉన్న పాఠశాలలకు 1:30 ప్రకారం ఉపాధ్యాయులను కేటాయిస్తారు.
==> ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 75 దాటితే హెడ్మాస్టర్ మరియు స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులు ఇస్తామన్నారు. మిగిలిన సర్ప్లస్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులను కూడా మిగిలిన పాఠశాలలకు సర్దుతారు.
==> ఉపాధ్యాయుల ప్రమోషన్లకు సంబంధించి టీచర్ ప్రొఫైల్ అప్డేషన్ కు వీలైనంత త్వరలో అవకాశం ఇస్తామని తెలిపారు. మొత్తం మూడుసార్లు అవకాశం ఇస్తారు. ఏవైనా తప్పులు దొర్లితే డీఈవోలు ద్వారా సరి చేస్తారు. 
==> ఈ వివరాల ద్వారానే ప్రమోషన్  సీనియార్టీ ను మెరిట్ కమర్ రోస్టర్ పద్ధతిలో తయారు చేస్తారని తెలిపారు.
==> ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్లు ఎట్టి పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
==>  ఉపాధ్యాయుల శాశ్వత బదిలీల కోడ్ పై సవివరంగా చర్చించడం జరిగింది. 
==> టీచర్ల బదిలీలకు మే 31 ప్రాతిపదికగా కనీసం రెండు సంవత్సరాలు పూర్తి అవ్వాలని,గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన వారికి తప్పనిసరి బదిలీ ఉంటుంది. ప్రధానోపాధ్యాయులకు గరిష్టంగా ఐదు సంవత్సరాలు పూర్తవ్వాలి.
==> 2017లో బదిలీ అయిన వారు తప్పనిసరి బదిలీ  క్రిందకు రారు. 
==> సర్ ప్లస్ టీచర్లను గుర్తించేందుకు సర్వీస్ సీనియారిటీలో జూనియర్ ను గుర్తిస్తారు.
==> అలా గుర్తించిన జూనియర్ కు స్పెషల్ పాయింట్లు, ప్రిఫరెన్షియల్ పాయింట్లు పాయింట్లు వస్తాయి. 
==> అలా కాకుండా రేషనల్లైజేషన్లో సీనియర్  విల్లింగ్  ఇచ్చినట్లయితే వారికి స్పెషల్ పాయింట్లు, పాయింట్లు రావు. 
==> మున్సిపల్ టీచర్ల ప్రమోషన్లు రెండు రోజుల్లో పూర్తి పూర్తిచేయాలని డిఈఓ లకు ఆదేశించామన్నారు.
==> నూతనంగా పంచాయతీలు ప్రాతిపదికగా  గుర్తించిన క్లస్టర్లను మరొకసారి సమీక్షిస్తారు. 
==> బదిలీలలో కేటగిరీలు గతంలో ఉన్న విధంగానే 16% హెచ్ఆర్ఏ కేటగిరి 1 గా, 12 శాతం హెచ్ఆర్ఏ క్యాటగిరి 2 గా, 10 శాతం హెచ్ఆర్ఏ క్యాటగిరి 3 గా, 
==> రోడ్డు సౌకర్యం లేని పాఠశాలలో కేటగిరి 4 గా ఉంటాయి.
==> స్టేషన్స్ సీనియారిటీ పాయింట్లు కూడా క్యాటగిరీ 1 కు ఒక పాయింట్ క్యాటగిరి 2 కు రెండు పాయింట్లు కేటగిరి 3 కి మూడు పాయింట్లు, కేటగిరి నాలుగు కు 5 పాయింట్లు ఉంటాయి.
==> రీఅపోర్షన్ మెంట్ ద్వారా బదిలీ అయ్యే వారికి  గత పాఠశాల పాయింట్లు తీసుకునేటప్పుడు 8  సంవత్సరాలకు మించకుండా పాయింట్లు కేటాయిస్తారు. 
==> సర్వీస్ పాయింట్లను సంవత్సరానికి ఒక్కటిగా నిర్ధారించారు. 
==> ఐదు స్పెషల్ పాయింట్లు ను 40 సంవత్సరాలు దాటిన అవివాహత మహిళలకు , పీహెచ్ 40 నుండి 69 శాతం వరకు ఉన్న వారికి, 13 జిల్లాల గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల బాధ్యులకు  ఇస్తారు. 
==> స్కౌట్స్ అండ్ గైడ్స్ వారికి రెండు స్పెషల్ పాయింట్లు కేటాయిస్తారు. 
==> 80 శాతం విహెచ్/ఓహెచ్ వారికి మినహాయింపు, 70 శాతం పైన 79% వరకు ఉన్న విహెచ్/ఓహెచ్ వారికి ప్రిఫరెన్షియల్ క్యాటగిరి వర్తిస్తుంది 
==> ఇంకా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కింద క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, కిడ్నీ, బోన్ టీబి తదితరం వస్తాయి.
==> ప్రిఫరెన్షియల్ కేటగిరి ఉపాధ్యాయుల మెడికల్ సర్టిఫికెట్లు జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జనవరి నుండి ఇప్పించే ప్రయత్నం చేస్తామన్నారు.
==> ఇకపై సీఆర్పీల ద్వారా సమాచారాన్ని తెప్పించుకునే ఏర్పాటు చేస్తామన్నారు.


Also Read: Free Bus Journey: సీనియర్‌ సిటిజన్లకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..ఎప్పటి నుంచి అంటే?   


Also Read: Viral Video: గెలికినందుకు పక్కా అనుభవిస్తారు...!.. తెలుగు ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్లు చేసిన వేణు స్వామి.. వీడియో వైరల్..  


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter