Venu swamy controversy comments on Tollywood video: వేణు స్వామి ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఆయన సమంత, చైతుల మధ్య విడాకులు అవుతాయని ఏ మూహూర్తానికి చెప్పారో.. అప్పటి నుంచి తెగ ట్రెండింగ్ లో ఉంటున్నారు. అంతే కాకుండా.. ఆ తర్వాత ఆయన అనేక మంది సెలబ్రీటీలకు జాతకాలు సైతం చెప్పారు. కొన్నిసార్లు ఆయన చెప్పినవి జరిగాయని చెప్తుంటారు. ఇక రాజకీయాలపై ఆయన చెప్పిన జాతకాలు ఇటీవల రివర్స్ అయ్యారు.
ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ లు మరల అధికారంలోకి వస్తారన్నారు. కానీ దానికి పూర్తిగా భిన్నంగా జరిగింది. మరోవైపు ఇటీవల ముచ్చటగా రెండో పెళ్లి చేసుకున్న శోభిత, చైతులు విడిపోతారని కూడా బాంబు పేల్చారు. దీనిపై మహిళ కమిషన్ సీరియస్ అయ్యింది. హైకోర్టు వరకు కూడా ఈ ఘటన వెళ్లిన విషయం తెలిసిందే. అయితే..ప్రస్తుతం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా అనేక షాకింగ్ ఘటనలు జరుగుతున్నాయి.
నన్ను గెలికారు అందుకే సినిమా ఇండస్ట్రీ పతనం మొదలు అయ్యింది!
-- వేణు స్వామి
😳😳😳😳😳😳😳 pic.twitter.com/D6BZO8fQyI
— మీ కాపలా కుక్క (@mekaapalaKukka) December 18, 2024
నాగార్జున ఎన్ క్లేవ్ ను హైడ్రా కూల్చివేయడం, మోహన్ బాబు వివాదం, అల్లు అర్జున్ అరెస్ట్ కావడం మొదలైనవి ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని కుదేలు చేస్తుందని చెప్పుకొవచ్చు. ఈనేపథ్యంలో వేణు స్వామి మరో సంచలన వీడియో విడుదల చేశారు. తనను కొంత మంది కావాలని వేధించారని, గెలికారని అందుకే ఇలా జరుగుతుందని కూడా వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు.
తాను గతంలో చెప్పినట్లు తెలుగు ఇండస్ట్రీ గింగిరాలు కొడుతుందని చెప్పిన విషయంను మరోసారి గుర్తు చేశారు. అంతే కాకుండా.. వచ్చే ఏడాది కూడా.. మార్చి 2025 లో కూడా తెలుగు ఇండస్ట్రీలో అనేక ఘటనలు జరుగుతాయని కూడా వేణు స్వామి షాకింగ్ భవిష్యవాణి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter