Kadapa Airport Flights: ఆంధ్రప్రదేశ్‌లో మరో విమానాశ్రయం నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. దేశీయ ప్రయాణం చేసేందుకు కడప విమానాశ్రయంలో రోజు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలకు కడప నుంచి ఇకపై సులువుగా రాకపోకలు సాగించవచ్చు. ఈ మేరకు కడపలో విమానాల రాకపోకలకు సంబంధించిన సేవల జాబితా విడుదల చేసింది. కడప నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, విశాఖపట్టణం, రాజమండ్రి, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ తదితర నగరాలకు రాకపోకలు చేయవచ్చు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Liquor Policy: ఏపీ మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. బిర్యానీ కన్నా తక్కువ ధరకే మద్యం


కడప విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసుల వివరాలను కడప ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శివప్రసాద్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన రాజమండ్రి, విశాఖపట్టణం, విజయవాడతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు నిత్యం విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. సుదూర ప్రాంతాలకు నిమిషాల్లో చేరుకునేందుకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఈ సర్వీసులను ఉపయోగించుకుని సమయం ఆదా చేసుకోవాలని సూచించారు.

Also Read: AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో పదవుల పండుగ.. ఆశల పల్లకీలో నాయకులు


 


కడప విమాన సర్వీసులు 
కడప వయా హైదరాబాద్‌ నుంచి గోవా, తిరువనంతపురం, మధురై, భువనేశ్వర్‌, రాజమండ్రి, విశాఖపట్టణం, రాయపూర్‌, ఇండోర్‌, జబల్‌పూర్‌, ముంబై, చండీగర్‌, వారణాసి, జైపూర్‌, సూరత్‌, రాంచీ, ఢిల్లీ వెళ్లేందుకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 


వయా చెన్నై మీదుగా
కడప నుంచి బయల్దేరి వయా చెన్నై మీదుగా వడోదర, కోయంబత్తూరు, మధురై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, మైసూర్‌ వెళ్లే సర్వీసులు
వయా బెంగళూరు
కడప నుంచి బయల్దేరి వయా బెంగళూరు నుంచి తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్‌, హుబ్లీ, లక్నోలకు వెళ్లే సర్వీసులు


విమాన సర్వీసులు.. సమయం


చెన్నై-కడప : 08.05 - 09.20


కడప-చెన్నై : 14.00 - 15.20


కడప-విజయవాడ : 09.45 - 11.00


విజయవాడ-కడప : 11.45 - 13.20


బెంగళూరు-కడప : 09.25 - 10.30


కడప-బెంగళూరు : 15.10 - 16.15


కడప-విశాఖపట్నం : 10.50 - 12.40


విశాఖపట్నం-కడప : 13.00 - 14.50


హైదరాబాద్‌-కడప : 09.45 - 11.05


కడప-హైదరాబాద్‌ : 11.35 - 13.05


విమానాల రాకపోకలు ఇవే
కడప-హైదరాబాద్‌ : ప్రతిరోజు విమాన సర్వీసులు ఉంటాయి.
కడప-విజయవాడ-కడప: సోమ, బుధ, శుక్ర, ఆదివారం
చెన్నై-కడప-చెన్నై : సోమ, బుధ, శుక్ర, ఆదివారం
బెంగళూరు-కడప-బెంగళూరు: మంగళ, గురు, శనివారం
కడప-విశాఖపట్నం-కడప : మంగళ, గురు, శనివారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter