AP Coroporation Posts: ఆంధ్రప్రదేశ్‌లో మరో జాతర రాబోతున్నది. అయితే ప్రజలకు సంబంధించిన జాతర కాదు. రాజకీయ నాయకులకు సంబంధించినది. అదే పదవుల పండుగ. ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. త్వరలోనే నాయకులకు పదవులు దక్కే అవకాశం ఉంది. పదవుల భర్తీ చేపట్టేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజకీయ నాయకులు పైరవీలు.. పదవులకు గాలం వేస్తున్నారు.
Also Read: Independence Day: ఆగస్టు 15న జెండా ఎగురవేసే మంత్రుల జాబితా ఇదే! మరి పవన్ కల్యాణ్ ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి నామినేటెడ్ పదవుల పండుగ జరగనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 90 కార్పొరేషన్లు, సంస్థలు ఉన్నాయి. ప్రభుత్వం మారడంతో ఆ స్థానాల చైర్మన్‌గిరి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే పదవుల పందేరంలో భాగంగా 40 పదవుల వరకు భర్తీ చేయొచ్చని తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌తోపాటు పురందేశ్వరి పదవులు పంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పదవుల పంపకాన్ని సమయం రావడంతో నాయకులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం వద్ద లాబీయింగ్, పైరవీలు చేసేందుకు సిద్ధమయ్యారు.
Also Read: AP New Passbooks: సీఎం చంద్రబాబు విస్మయం.. ఒక్క జగన్ బొమ్మలకే రూ.700 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో జనసేన, తెలుగుదేశం, బీజేపీలు కలిపి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు తమ నాయకులకు సీట్ల సర్దుబాటు చేశారు. ఈక్రమంలో కొందరు నాయకులు పదవులు త్యాగం చేశారు. కలిసి పోటీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో మైత్రి పార్టీ నాయకుడికి సహకరించారు. ఎన్నికల సమయంలో సీట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రధానంగా తీవ్ర రచ్చ రేపిన పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ శర్మకు పెద్ద పదవి లభించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొత్తం నామినేటెడ్ పదవుల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో 60 శాతం టీడీపీ, 30 శాతం జనసేన, 10 శాతం బీజేపీకి దక్కనున్నట్లు సమాచారం. ఈనెల 16వ తేదీన నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేలా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు ఏపీలో ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కల్యాణ్, పురందేశ్వరిలతో చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తోంది. తమ పార్టీ నాయకులకు ఎవరికీ పదవులు ఇవ్వాలనేది ఓ జాబితాను వారు చంద్రబాబు ముందుంచినట్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమతూకం పాటిస్తూనే.. ఎన్నికల్లో పార్టీ గెలుపుకు దోహదం చేసిన వారికే పదవులు దక్కే అవకాశం ఉంది. మొదటి దశలో వారికే ప్రాధాన్యం ఇవ్వనుండగా.. రెండో దశలో ఇతర నాయకులకు అవకాశం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter