ఉన్నత ఆశయంతో వైద్య వృత్తిలోకి వచ్చారు. కనీసం 3 పదుల వయసు కూడా లేదు. కానీ కరోనా వైరస్ (CoronaVirus) మహమ్మారి ఆ యువ వైద్యుడ్ని బలి (Kadapa Government Doctor dies due to CoronaVirus) తీసుకుంది. తొలిసారి కరోనా సోకినా ధైర్యంగా ఎదుర్కున్నారు. కానీ రెండోసారి కరోనా వైరస్ సోకడంతో ఆ యంగ్ గవర్నమెంట్ డాక్టర్ కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఈ విషాదం (Kadapa Doctor Dies due to CoronaVirus) చోటుచేసుకుంది.



 


జిల్లాలోని బద్వేలు ప్రభుత్వాసుపత్రిలో నందకుమార్‌(28) చిన్న పిల్లల వైద్యుడు (Children Specialist Doctor)గా సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట యంగ్ డాక్టర్ నందకుమార్ కరోనా వైరస్ (CoronaVirus) బారిన పడ్డారు. దాంతో ఆయన మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజులకు కోవిడ్19 (COVID-19)ను జయించారు. అనంతరం యథావిధిగా డ్యూటీలో జాయిన్ అయి సేవలు కొనసాగిస్తున్నారు. దాదాపు రెండు వారాల కిందట ఆయనకు జ్వరం రావడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. 



 
హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందినా ప్రయోజనం కనిపించలేదు. దీంతో కడప రిమ్స్‌లో జాయిన్ అయ్యారు. అక్కడి వైద్యుల సలహామేరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. కానీ పరిస్థితిలో ఏ మార్పులేకపోవడంతో 2 రోజుల కిందట చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. కానీ విధి వక్రించింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం నందకుమార్‌ మృతి చెందారు. ఎంతో ఇష్టంతో వైద్య వృత్తిలోకి వస్తే చివరికి కరోనా మహమ్మారి నందకుమార్‌ను పొట్టన పెట్టుకుందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe