తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ మరో అరుదైన ఘనత సాధించనున్నారు.  రెండు పర్యాయాలు పూర్తి కాలం పాటు గవర్నర్ గా సేవలందిస్తున్న నరంసింహన్ ఆయన హయాంలో ఇప్పటి వరకు నలుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించి నాలుగు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు..ఇప్పుడు తాజాగా జగన్ చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఐదుగురు ముఖ్యమంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ గా ఆయన రికార్డు సృష్టించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిరణ్ టూ జగన్...


గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆరంభం దశలో ఉమ్మడి రాష్ట్రంలో  కిరణ్‌ కుమార్ రెడ్డి ( 2010) చేత, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు (2014 )తో  ఒకసారి ప్రమాణస్వీకారం చేయించి ప్రభుత్వాలు ఏర్పాటు చేయించగా... విభజన తర్వాత తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌( 2014,2018) చేత రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు తాజాగా జగన్ చేత ప్రమాణస్వీకారం చేయించి అరుదైన ఘనతను  నరసింహన్ సొంతం చేసుకోనున్నారు.