Govindananda Saraswati: `TTD దైవద్రోహం చేస్తోంది`.. గోవిందానంద సరస్వతి షాకింగ్ కామెంట్స్
Govindananda Saraswati: హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదని హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
Govindananda Saraswati sensational comments on TTD: తిరుపతిలో హనుమత్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి మీడియా సమావేశం నిర్వహించి...తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ పాలకమండలి దైవద్రోహం చేస్తుందంటూ మండిపడ్డారు. హనుమంతుని జన్మస్థలం పేరుతో నకిలీ పుస్తకం ముద్రించి..ప్రజలను, సన్యాసులను తప్పుదోవ పట్టిస్తోందని గోవిందానంద సరస్వతి (Govindananda Saraswati) ఆరోపించారు. అంజనాద్రి పేరుతో తిరుమలలో దుకాణాలను నిర్మించి.. డబ్బులు సంపాదించాలని యోచిస్తోందని విమర్శించారు.
హనుమంతుడు తిరుమలలోని అంజనాద్రిలో జన్మించలేదన్న గోవిందానంద సరస్వతి.. మారుతి పుట్టుక విషయంలో గందరగోళం సృష్టించారని వాపోయారు. కిష్కిందలోని పంపా తీరంలోనే హనుమంతుడు పుట్టాడన్న (Hunuman Birth) ఆయన.. సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగించే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. రూ.1200 కోట్లతో కిష్కింద అభివృద్ధికి కర్ణాటక సీఎం ఇప్పటికే ప్రకటన చేశారని ఈ సందర్భంగా గుర్తుచేశారు గోవిందానంద సరస్వతి. కిష్కిందలోని పంపా తీరంలోనే హనుమంతుడు జన్మించాడని అందరూ అంగీకరించారని... ప్రధాని మోదీ, అమిత్ షా అక్కడకు వెళ్లి ఈ విషయాన్ని ఒప్పుకున్నారన్నారని గోవిందానంద అన్నారు.
Also Read: Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి ఆఫ్ లైన్ లో సర్వదర్శనం టోకెన్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook