AP Schemes Renamed No More YSR YS Jagan Names:  కూటమి ప్రభుత్వం అధికారంలోకి మారడంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పథకాల పేర్లు మారనున్నాయి. పథకాల పేర్లు మారుస్తూ ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పథకాలకు నాటి సీఎంలు వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌ పేర్లు తొలగిపోనున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వ పత్రాలు, ప్రభుత్వ భవనాలు వంటి వాటిపై పార్టీ గుర్తులు, రంగులు, ఫొటోలు ముద్రించకూడదని ఆదేశించింది. అలాంటివి ఉంటే వెంటనే తొలగించాలని.. అలాంటి పత్రాలు ఉంటే వెంటనే నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Ration Items: పేదలకు చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. రేషన్‌ సరుకుల్లో బియ్యంతోపాటు చక్కెర, పప్పు


వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది. నాటి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ పథకాలకు తన పేరు, తన తండ్రి వైఎస్సార్‌ పేర్లు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వాటిని తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకుమ గ్రామ, వార్డు సచివాలయ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న విదేశీ విద్యా దీవెన, వైఎస్సార్ కల్యాణమస్తు, జగనన్న సివిల్ సర్వీసెస్ ముందు పేర్లు తొలగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 2019కి ముందు ఏపీ ప్రభుత్వంలో ఉన్న పేర్లు అమలు చేయాలని ఈ మేరకు ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చింది.

Also Read: Sidda Raghava Rao: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో తొలి వికెట్‌


 


ఆదేశాలు ఇవే..


  • ఎన్నికల నియమావళి సమయంలో సచివాలయాలకు ఇచ్చిన హై సెక్యూరిటీ పేపర్లను మాత్రమే ప్రస్తుతం ఉపయోగించాలి. హై సెక్యూరిటీ పేపర్‌పై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఫొటో కలిగి ఉన్న సర్టిఫికెట్స్‌ మాత్రమే సర్వీసులను గ్రామ వార్డు సచివాలయం ద్వారా అందించాలి.

  • 2019 మే నెలకు ముందు ప్రారంభమై 2019-2024 మధ్య కొనసాగించిన ప్రభుత్వ పథకాల పేర్లు మళ్లీ 2019లో ఎలా ఉన్నాయో అలా మార్పు చేయాలి.

  • 2019-24 మధ్యలో ప్రారంభమైన కొత్త పథకాల పేర్లను వెంటనే తొలగించి కొత్తగా పేర్లు పెట్టే వరకు వాటికి సాధారణ పేరును మాత్రమే ఉపయోగించాలి.

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పార్టీ జెండా రంగులను తీసివేయాలి. పాస్ పుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సర్టిఫికెట్లపై పార్టీ జెండాలకు సంబంధించిన రంగులు ఉంటే వెంటనే నిలిపివేయాలి.


పేర్లు మారేవి ఇవే..


  • జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పేర్లు ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్పు

  • జగనన్న విదేశీ విద్యా దీవెన (ఎస్సీ) అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్పు.

  • వైఎస్సార్ కల్యాణమస్తు పథకం పేరు చంద్రన్న పెళ్లి కానుకగా మార్పు 

  • వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరు ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్పు

  • జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరు సివిల్ సర్వీస్ పరీక్ష ప్రోత్సాహకాలుగా మార్పు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter