దాచేపల్లి ఘటన తనను ఎంతగానో బాధించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులోని జిజిహెచ్‌కు చేరుకొని దాచేపల్లి అత్యాచార బాధితురాలిని ఆయన పరామర్శించారు. ఇలాంటి ఘటనలకు మరెవరైనా పాల్పడితే భూమి మీద అదే వారికి చివరిరోజు అని హెచ్చరించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించాలన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆడవారి జోలికెళ్తే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందేనన్నారు. ఈ ఘటనకు సంఘీభావంగా సోమవారం నాడు ప్రజా చైతన్య ర్యాలీ చేపట్టనున్నట్లు సీఎం తెలిపారు. చిన్నారి బాధితురాలైన భవిష్యత్ బాధ్యత తనదేనని, ఆ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని అన్నారు. ఇలాంటి ఘటనలు రాజకీయం చేయవద్దని నేతలకు సూచించారు.


ఏపీలో మరో దారుణం


దాచేపల్లి ఘటన మరువక ముందే ఏపీలో మరో దారుణం జరిగింది. కడప జిల్లా బద్వేలులో ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. యువతి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.