Ongole Attack Case: ప్రకాశం జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంగోలులో ఇటీవల జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఓ యువకుడిని చితక్కొట్టిన 9 మంది దుండగులు.. రక్తం కారుతున్నా అతడిని వదల్లేదు. అనంతరం అతడి నోట్లో మూత్రం పోసి.. పైశాచిక ఆనందం పొందారు. అందరూ కలిసి మద్యం తాగగా.. ఓ పాత వివాదం గుర్తుకొచ్చి దుండగులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధ్యప్రదేశ్ గిరిజన యువకుడి మీద మూత్రం పోసిన ఘటన తరహాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఏపీలో కలకలం రేపుతోంది. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అనే వ్యక్తులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. జులాయిగా తిరుగుతున్న వీరిద్దరు దొంగతనాలకు పాల్పడేవారు. ఈ ఇద్దరిపై 50పైగా చోరీ కేసులు నమోదయ్యాయి. నవీన్ పోలీసులకు దొరికిపోయి పలుమార్లు జైలుకు వచ్చాడు. అంజి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరు దూరం దూరంగా ఉంటున్నారు.


నవీన్‌కు కాల్ చేసిన అంజి.. ఒంగోలులోని కిమ్స్ మెడికల్ కాలేజ్ వెనక్కి రావాలని చెప్పాడు. అక్కడ మద్యం తాగుదామన్నాడు. అంజి మాటలు నమ్మి అక్కడికి వెళ్లగా.. మొత్తం 9 మంది ఉన్నారు. అందరూ కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో పాత గొడవను అంజి గుర్తుకు తెచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా.. అప్పటికే ప్లాన్‌ వేసుకున్న ప్రకారం యువకులు నవీన్‌పై దాడికి దిగారు. రక్తం వచ్చేలా కొట్టారు. తనను వదిలిపెట్టాలని నవీన్ ప్రాధేయపడినా.. వినకుండా చితకబాదారు.


అంతటితో ఆగకుండా.. బాధితుడిపై మూత్రం పోశారు. నోట్లో పోస్తూ తాగాలంటూ ఒత్తిడి చేశారు. వీడియోలను కూడా తీస్తూ.. పైశాచిక ఆనందం పొందారు. అక్కడి నుంచి నిందితులు పారిపోగా.. బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాని నిందితుడితోపాటు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు. 


Also Read: Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత..


Also Read: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటున్న నాగార్జున..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook