Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత..

Sri Ramana death: మిథునం కథా రచయిత శ్రీరమణ అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన పేరడీ రచనలకు ఫేమస్. శ్రీరమణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 19, 2023, 10:13 AM IST
Sri Ramana: టాలీవుడ్ లో మరో విషాదం.. ‘మిథునం’ కథా రచయిత శ్రీరమణ కన్నుమూత..

Mithunam Writer Sri Ramana Passed away: టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.  మిథునం కథా రచయిత శ్రీరమణ (70) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన (Sri Ramana) బుధవారం తెల్లవారుజాము 5 గంటలకు తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శ్రీరమణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

శ్రీరమణ ఎన్నో తెలుగు చిత్రాలకు కథా రచయతిగా వ్యవహారించారు. జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత కాలమిస్టుగా, కథా రచయితగా మారారు. ఈయన బాపు-రమణలతో కూడా కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఈయన పేరడీ రచనలకు ప్రసిద్ధి. గతంలో శ్రీరమణ నవ్య వారపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. గుంటూరు జిల్లా వేమూరు మండలానికి చెందిన వరహాపురం అగ్రహారంలో 1952, సెప్టెంబరు 21న శ్రీరమణ పనిచేశారు. 

Also Read: Anurag Thakur: 'బెస్ట్ వెబ్‌ సిరీస్‌లకు ఇకపై ఏటా అవార్డులు': అనురాగ్ ఠాకూర్‌

తనికెళ్ళ భరణి దర్శకత్వం వహించిన 'మిథునం' (Mithunam) సినిమాకు కథ అందించింది ఈయనే. ఆ సినిమా రచయితగా శ్రీ రమణకు ఎంతో మంచి పేరు తెచ్చింది.  2012లో విడుదలైన సూపర్ హిట్ సాధించింది. అంతేకాకుడా ఇది అస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయింది. కాగా ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో... 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్' అంటున్న నాగార్జున..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News