Cold Waves in Telangana Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో  ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఒక్కసారిగా చలి తీవ్రత భారీగా పెరిగిపోయింది. ఉదయం 8 అవుతున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే వణికిపోతున్నారు. ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. ఎమర్జన్సీ ఉద్యోగులు తప్ప మిగతా వారు పని ఉంటేనే బయటకు వస్తున్నారు.  చలికి తోడు దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో.. రోడ్లపై వెళ్లే వాహనాలు సరిగా కనిపించడం లేదు. దీంతో నగరంలోని చాలా రోడ్డు ఉదయం పూట ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో తెల్లవారుజామున 9 గంటలు అవుతున్నా మంచు దుప్పట్లు వదలడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే.. వాహనదారులు తీవ్ర ఇక్కట్టు ఫేస్ చేస్తున్నారు. తెలంగాణలోని అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలైతే.. ఉదయం 10 గంటలు దాటితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. చలి తీవ్రత పెరగడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా రోడ్ల వెంట చలి మంటలతో కాపుకుంటున్నారు.  


మంగళవారం తెలంగాణలో అత్యల్పంగా.. పటాన్‌చెరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగా రానుంది. సంక్రాంతి పండగతో దక్షిణాయం ఎండ్ కార్డ్ పడబోతుంది. ఆ తర్వాత సూర్యుడు నెమ్మది నెమ్మదిగా తన ఉగ్ర రూపం చూపించనున్నారు.  దీంతో అప్పటి వరకు గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఉన్నవారు.. చలికి సంబంధించిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..


ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.