Tirumala Temple: భక్తులతో తిరుమల పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నారు. క్యూలైన్లలోనే భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదాలను అందజేస్తున్నారు. గతకొంతకాలంగా గురువారం నుంచి ఆదివారం వరకు తిరుమలకు భక్తులు పోటెత్తున్నారు. ఆలయంలో విపరీతంగా రద్దీ ఉంటోంది. వీకెండ్‌లో దాదాపు లక్షల మంది స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందితో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్షనిర్వహించారు. వీకెండ్ సమయంలో మరింత అప్రమత్తతంగా ఉండాలని ఆదేశించారు. అన్నమయ్య భవన్‌లో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. శనివారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.


క్యూలైన్ల నిర్వహణలో టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారులు, పోలీసులు సమన్వయం పనిచేయాలన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. గదుల కేటాయింపులో జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీతో వాహనాల రాకపోకలపై అంతరాయం ఏర్పడుతోంది. వాహనాలు సజావుగా సాగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కళ్యాణకట్టలో రోజుకు సుమారు 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించే అవకాశం ఉంది. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అన్నమయ్య భవన్‌ జరిగిన సమీక్షా సమావేశంలో చీఫ్‌ ఇంజినీర్ నాగేశ్వరరావు, వీజీవో బాలిరెడ్డితోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


Also read:Jos Buttler New Record: సూపర్ ఫామ్‌లో జోస్ బట్లర్..తాజాగా మరో రికార్డు బద్ధలు..!


Also read:Telangana Inter Board: ఇక నుంచి వంద శాతం సిలబస్..ఇంటర్ ఫలితాలు అప్పుడేనా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.