Telangana Inter Board: ఇక నుంచి వంద శాతం సిలబస్..ఇంటర్ ఫలితాలు అప్పుడేనా..!

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుందని స్పష్టం చేసింది. మరోవైపు ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Written by - Alla Swamy | Last Updated : Jun 24, 2022, 06:39 PM IST
  • తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం
  • ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్
  • త్వరలో ఇంటర్ ఫలితాలు
Telangana Inter Board: ఇక నుంచి వంద శాతం సిలబస్..ఇంటర్ ఫలితాలు అప్పుడేనా..!

Telangana Inter Board: తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుందని స్పష్టం చేసింది. కరోనా కారణంగా రెండేళ్లు తరగతులు సరిగా జరగలేదు. దీంతో 30 శాతం సిలబస్‌ను తొలగించారు. ఇంటర్ ఆధారంగానే ఎంసెట్‌లోనూ 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉండటంతో పాత విధానం తీసుకువస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

ఈవిద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ సంవత్సరాల్లో వంద శాతం సిలబస్‌ అమల్లో ఉండనుంది. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలో ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామన్నారు. మరోవైపు తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. రెండు మూడురోజుల్లో ఫలితాలు రానున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

గతకొన్నిరోజులుగా రిజల్ట్‌పై ఊహాగానాలు వినిస్తున్నాయి. ఇప్పటికే మూల్యాంకనం పూర్తైంది. ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు సైతం పూర్తి అయినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకుని పక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే రిజల్ట్ రావడంతో ఆలస్యమవుతోందని ప్రచారం జరుగుతోంది. రిజల్ట్ చిట్టా పూర్తి కాగానే ఫలితాలను విడుదల చేస్తారని అధికార వర్గాలే చెబుతున్నాయి. 

ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఈఏడాది 9.65 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అంతే మంది విద్యార్థులు  ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరైయ్యారు.  కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఇంటర్ పరీక్షలు చేపట్టలేదు. ఈసారి ఇంటర్  పరీక్షలు మే 6 నుంచి 24 వరకు జరిగాయి. ఇప్పటికే ఏపీలో ఇంటర్ ఫలితాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో త్వరగా విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Also read:Maharashtra Political Crisis: విలాసవంతమైన హోటల్‌లో రెబల్స్‌..ఖర్చు వివరాలు తెలిస్తే షాకే..!

Also read:Nandamuri Balakrishna: కరోనా బారిన పడ్డ నట సింహం..వెల్లడించిన నందమూరి బాలకృష్ణ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News