Rain Alert: ఏపీలో నాలుగురోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ( Bay of bengal ) ఏర్పడిన అల్పపీడన ( Depression ) ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ( heavy rains ) కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ( Bay of bengal ) ఏర్పడిన అల్పపీడన ( Depression ) ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 4 రోజుల పాటు భారీ వర్షాలు ( heavy rains ) కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. అటు తీరం వెంబడి 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడం, 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తుల అలలు ఎగసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆ శాఖ కమీషనర్ కన్నబాబు స్పష్టం చేశారు.
ఆగస్టు 13 న విశాఖ ( Visakha ), తూర్పు గోదావరి జిల్లాల్లో ( East Godavari District ) అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని..మిగిలిన ప్రాంతాల్లో తేలిక నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఇక ఆగస్టచు 14న విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 15న విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక ఆగస్టచు 16న విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. మిగిలి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. Also read: AP: కీలక ఐపీఎస్ లకు స్థాన చలనం, ఐబీ సస్పెన్షన్ పొడిగింపు