Weather Alert: ముంచుకొస్తున్న మరో ముప్పు...మళ్లీ మరో అల్పపీడనం...ఏపీకి భారీ వర్ష సూచన!
రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో..రాయలసీమ, దక్షిణకోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
AP Rain Alert: ఏపీ(Andhra Pradesh)లో మరోసారి భారీ వర్షాలు(Rain Alert) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం(Low Pressure) ఏర్పడే అవకాశం ఉండటంతో..ఏపీలోని రాయలసీమ, దక్షిణకోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ప్రకటించింది.
అల్పపీడనం క్రమంగా బలపడి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో నేటి నుంచి 30వరకు రాయలసీమ.. ముఖ్యంగా చిత్తూరు(Chittoor), నెల్లూరు(Nellore) జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 13సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Also Read: Tirupati: తిరుపతిలో షాకింగ్ ఘటన- భూమి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్
వాతావరణ శాఖ హెచ్చరికలతో చిత్తూరు జిల్లా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. తూర్పు ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఉందని కలెక్టర్ ఎం.హరి నారాయణన్ స్పష్టం చేశారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. చిత్తూరు జిల్లాలో నేడు విద్యాలయాలకు సెలవు(Holiday) ప్రకటించారు.
తమిళనాడు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతారణ విభాగం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడన ప్రభావం తమిళనాడు(Tamilnadu)లో 28 జిల్లాలపై ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా..13 జిల్లాలు రెడ్ అలర్ట్ కింద ఉన్నట్లు తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook