Heavy Rains: దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల చురుకుగా కదులుతున్నాయి దీంతో ఏపీ, తెలంగాణల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్దిరోజులుగా చూస్తే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఇక ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంతేకాదు ఇక్కడ ఉపరితలంపై బలమైన గాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక తెలంగాణలోని ఈ రోజు రేపు కూడా పలు  జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇందు కోసం అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాదు 30- 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు  కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


అటు ఆంధ్రప్రదేశ్ లోని మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లోని అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావారణ కేంద్రం తెలపింది. ఉండి,  కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter