Heavy Rains: ఆంధ్ర ప్రదేశ్ కు మరో తుఫాను ముప్పు.. భయం గుప్పిట్లో జనం..
Heavy Rains Telugu States:రెండు తెలుగు రాష్ట్రాల్లో వానాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే వాయు గుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో మరో తుఫాను ముప్పు ముంచి ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది.
Heavy Rains Telugu States: ఆంధ్ర ప్రదేశ్ లో వరుణుడు కుంభ వృష్టి కురిపిస్తున్నాడు. దీంతో ఎన్నడు లేనంతగా ఎన్నడు వరద ముంపుకు గురి కానీ ప్రదేశాలు నీట మునిగాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే సహాయ పునరావాస చర్యలకు ఉపక్రమించింది. అంతేకాదు ఏపీ చంద్రబాబు నీట మునిగిన వరద ప్రాంతాల్లో సహాయ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ లో భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారు. అంతేకాదు వరద ప్రాంతాల్లో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి ఈ నెల 6 మరియు 7వ తేదిల్లో బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ పట్నం వాతావరణ శాఖ తెలిపింది. అది తుఫానుగా బలపడి ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని తెలిపారు. మరో రెండు రోజుల్లో అల్ప పీడనంపై ఖచ్చితమైన సమాచారం వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ లలో భారీ వర్షాల కారణంగా విజయవాడ నీట మునిగింది. అక్కడ రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి.వరద అంటే తెలియని వారికీ ఇపుడు ఈ పరిస్థితి చూసి తల్లడిల్లి పోతున్నారు. అంతేకాదు వరదల కారణంగా ఇంట్లో విలువైన వస్తువులు నీట మునగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్నది నీటి పాలు కావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా బెజవాడ కాలనీలను చుట్టుముట్టిన వరద నీరు విజయవాడను విలయవాడగా మార్చేసింది. బుడమేరు ముంపు నుంచి కాపాడేందుకు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రకృతి ప్రకోపం ముందు అవేవి ఫలించలేదు. పశ్చిమ, మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు నీట చిక్కుకోవడంతో పాటు కరెంట్ లేకపోవడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉండిపోయారు. మరోవైపు కొన్ని ముంపు ప ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలు మండకొడిగా సాగుతున్నాయి. మరోవైపు కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి వరదలో చిక్కుకున్న వారిని కాపాడే పనిలో పడ్డాయి.
అటు బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారి పోయింది. దాదాపు 2.76 లక్షల మంది ఆహారం, తాగునీరు, కరెంటూ లేక అల్లాడుతున్నారు. మరోవైపు కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితులు నెలకున్నాయి. దాదాపు ఈ ప్రాంతంలోని వారి ఇళ్లన్నీ ఆరడుగుల మేర నీటిలో మునిగాయి. అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఎత్తయిన భవనాల్లో చిక్కుకుపోయినవారు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు.బుడమేరు పొంగడంతో నగరం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి.
పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు.అటు హైదరాబాద్ నగరంపై వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించింది. వరద ల నేపథ్యంలో ఏపీలో 20 మందికి పైగా చనిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.