Heavy Rains in Telugu States: తెలంగాణ, ఏపీలో 3 రోజులు కుండపోత వానలు..
పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy Rains in AP Telangana: పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, మయన్మార్ దక్షిణ తీరం పరిసర ప్రాంతాల్లో రెండు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాటి ప్రభావంతో పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే తెలంగాణలో పలు ప్రాంతాలకు వెదర్ డిపార్ట్మెంట్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జగిత్యాల, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట,సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికు జారీ చేసింది.
అటు ఏపీలోనూ కృష్ణా, గుంటూరు, పల్నాడు, అనంతపూర్,నంద్యాల, బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ సూచించింది. నైరుతి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 70.36 సెం.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 91.90 సెం.మీ. వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 31% అధికమని అధికారులు చెబుతున్నారు. ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, తొమ్మిది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. సెప్టెంబర్ నెలాఖరుతో నైరుతి రుతుపవనాల సీజన్ ముగుస్తుంది.
సీజన్ ముగిసే నాటికి వర్షపాతం గణాంకాలు మరింత పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది నైరుతి సీజన్లో ఒక్క జిల్లాలో కూడా లోటు వర్షపాతం నమోదు కాకపోవడం విశేషం. మండలాల వారీగా వర్షపాతం నమోదును పరిశీలిస్తే 108 మండలాల్లో అత్యధిక వర్షపాతం, 283 మండలాల్లో అధిక వర్షపాతం, 216 మండలాల్లో సాధారణ వర్షపాతం, 5 మండలాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
ఇదీ చదవండి: ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!
ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.