Heavy Rains in Telugu States:మరో రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంతో పాటు ఉత్తర అండమాన్‌ ప్రాంతంలో.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపారు. ఒక రకంగా వరద, బురదలతో అల్లాడతున్న ప్రజలకు ఇది బాంబ్ లాంటి వార్త అని చెప్పాలి. అల్ప పీడనం తుపానుగా మారి,విశాఖపట్నం, ఒడిశా దిశగా ప్రయాణించి తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తున్నారు. ఈ రోజు రేపు దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వాయుగుండం ప్రభావం నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకముందే మరో అల్పపీడనం ఏర్పడనుందనే సమాచారం ముంపు ప్రాంతాల ప్రజలకు ఆందోళనతో పాటు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తూర్పు విదర్భ, తెలంగాణ పరిసరాల్లో కొనసాగుతోంది.ఇది రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశాలున్నాయని  వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరాతి వాతావరణ కేంద్రం తెలిపింది.గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల  వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.


తెలంగాణను  భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో లోతట్టు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు కరెంట్ లేకుండా చీకటి.. ఇంట్లో వస్తువులు వర్షాలకు తడవంతో పాటు సెల్ ఫోన్ అన్ని స్విచ్ఛాఫ్ అవడంతో బయట ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రోజు  తెలంగాణలోని  11 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లును ప్రభుత్వం హై అలర్ట్‌ చేసింది.


వాయుగుండం ప్రభావంతో కురిసిన కుంభవృష్టి వానలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలమైంది. ప్రధానంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో బాధితులకు భరోసా ఇచ్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ఆయా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిన్న సూర్యాపేట , ఖమ్మం జిల్లాల్లో పర్యటించిన ఆయన రాత్రి ఖమ్మం జిల్లాలో బససేశారు. ఇవాళ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడి బాధితులను పరామర్శించి భరోసా ఇవ్వనున్నారు.


 


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.