విశాఖపట్నం: కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించడంతో పాటు కొమెరిన్‌ తీరం నుంచి తమిళనాడు, రాయలసీమ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో సముద్రంపై నుంచి భారీగా తేమగాలులు వీస్తున్నాయి. ఫలితంగా కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. 


రాగల 24గంటల్లో కోస్తాంధ్రాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, పలుచోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఇవాళ, రేపు అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆర్టీజిఎస్ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్) వెల్లడించింది.