Godavari Floods: గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల్ని వరద చుట్టుముట్టింది. రేపటి వరకూ పరిస్థితి ఇలాగే ఉండవచ్చని తెలుస్తోంది. భద్రాచలం వద్ద గంటగంటకూ నీటిమట్టం పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా ఇంకా ముసురు వీడటం లేదు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందన్న హెచ్చరికల నేపధ్యంలో మరి కొద్దిరోజులు వర్షాల బెడద తప్పేట్టు లేదు. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 56 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే ఇక్కడ మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రేపటి వరకూ వరద ఉధృతి మరింత పెరగవచ్చని అంచనా. ఎగువ ప్రాంతాల్నించి వరద ముప్పు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. అయితే రేపటి వరకూ భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగి ఆ తరువాత తగ్గే సూచనలు కన్పిస్తున్నాయి.


మరోవైపు ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 15 అడుగులు దాటి ఉంది. 14.50 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదులుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. రేపు ఉదయం వరకూ వరద ఉధృతి పెరగవచ్చు. మొన్నటి నుంచి ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో కోసనీమ జలదిగ్బంధనంలో చిక్కుకుంది. లంక గ్రామాలు జలమయమయ్యాయి. కోనసీమ లంక గ్రామాలు ఇప్పటికీ వరద ఉధృతిలో చిక్కుకునే ఉన్నాయి.  ప్రదాన రహదారులపై అయితే 4-5 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. 


గోదావరి వరద మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. అయితే ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక వరకూ పరిస్థితి రాదంటున్నారు అధికారులు. 18 లక్షల క్యూసెక్కుల నీరు దాటితే ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక జారీ అవుతుంది. అయితే ఈలోగానే వరద తగ్గుముఖం పట్టవచ్చని అంచనా.


Also read: Ex Minister Narayana Wife Comments: మాజీ మంత్రి నారాయణ భార్య సంచలన ఆరోపణలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook