విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేటి ఉదయం కాకినాడ (Kakinada) సమీపంలో తీరాన్ని దాటింది. దాదాపు 17 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ కాకినాడ వద్ద తీరాన్ని దాటడంతో ఏపీలో నిన్నటి నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. తీవ్ర వాయుగుండం కారణంగా  తెన్నేటి పార్క్ తీరంలో ఓ నౌక ఒడ్డుకు కొట్టుకురావడం గమనార్హం. బంగ్లాదేశ్‌కు చెందిన మర్చంట్ వెసల్ నౌక భారీ ఈదురుగాలులకు ప్రయాణాన్ని కొనసాగించలేక సమీపంలోని తెన్నేట తీరం ఒడ్డుకు చేరింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

80 మీటర్ల పొడవాటి నౌక అయినప్పటికీ గాలితీవ్రత ఎక్కవగా ఉండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డుకు చేరుకుని ఇసుక తిన్నెల మధ్య, రాళ్ల మధ్య చిక్కుకుపోయింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో తీరానికి కొట్టుకురాగా, నౌకలోని సిబ్బంది, ఇతర ప్రయాణికులు అంతా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. నౌకను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకున్నారు.




 


కాగా, సముంద్రంలో నిలిపి ఉంచడానికి వాడే యాంకర్లు రెండూ పాడవడంతో నౌకలో సమస్య తలెత్తింది. దానివల్ల బంగ్లాదేశ్ నౌక తీరానికి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే నేవీ సిబ్బంది, అధికారులు అక్కడికి చేరుకుని నౌకను పొజిషన్ చేసేందుకు యత్నిస్తున్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe