Hero Vishal: సీఎం జగన్ అంటే ఇష్టం నా గుండెల్లో నుంచి వస్తుంది.. తమిళ స్టార్ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Hero Vishal Said Iam not coming into AP Politics in Lathi Movie promotions. ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే ఇష్టం తన గుండెల్లో నుంచి వస్తుందని తమిళ స్టార్ హీరో విశాల్ తెలిపారు.
Hero Vishal says I love AP CM YS Jagan Very Much: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తమిళ స్టార్ హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అంటే ఇష్టం తన గుండెల్లో నుంచి వస్తుందని తెలిపారు. ఒకవేళ ఓటు వేయాల్సి వస్తే.. వైఎస్ జగన్‌కు తప్ప మరెవరికీ వేయమని కుండబద్దలు కొట్టారు. ఇక తాను ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదని హీరో విశాల్ స్పష్టం చేశారు. దాంతో ఏపీలోని కుప్పంలో విశాల్ పోటీ చేస్తారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పడింది.
ఎ వినోద్ కుమార్ దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లాఠీ’. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్‌డిహెచ్‌ఆర్ కళాశాలల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి విశాల్ సందడి చేశారు. అయితే లాఠీ సినిమా ప్రమోషన్ కోసం కుప్పం వచ్చిన విశాల్.. నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవనున్నారు. దాంతో ఈ భేటీ.. విశాల్ కుప్పం నుంచి పోటీ చేయడం కోసమే అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే భేటీ జరగకముందే వైసీపీలో చేరడం లేదని విశాల్ స్పష్టం చేశారు.
లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో విశాల్ మాట్లాడుతూ... 'నాకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ సీఎం జగన్. సీఎం జగన్ అంటే ఇష్టం నా గుండెల్లో నుంచి వస్తుంది. నేను ఓటు వేయాల్సి వస్తే.. వైఎస్ జగన్‌కు తప్ప మరెవరికీ వేయను. అయితే సీఎం జగన్ అంటే ఇష్టం ఉన్నా.. నేను వైసీపీలో చేరడం లేదు. ఏపీ రాజకీయాల్లోకి రావడం లేదు. మాకు కుప్పంలో చాలా వ్యాపారాలు ఉన్నాయి. కుప్పంలో ప్రతిదీ నాకు తెలుసు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన నాకు అస్సలు లేదు' అని అన్నారు.
'నేను సినిమా హీరోగా ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సంపాదిస్తున్నా. ప్రజలకు సేవ చేసే ప్రతి ఒక్కరూ రాజకీయ నాయకులు కావాల్సిన అసవరం లేదు. ప్రజాసేవ చేయాలంటే.. ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఎలాగైనా మంచి చేయాలనుకుంటే చేయవచ్చు' అని హీరో విశాల్ పేర్కొన్నారు. నిజాయితీగల పోలీస్ పాత్రలో విశాల్ పర్ఫార్మెన్స్ లాఠీ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో సునైనా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
Also Read: కొత్త సంవత్సరంలో ఈ 5 రాశుల వారు చాలా అదృష్టవంతులు.. కెరీర్‌లో ఉన్నత స్థానం, భారీ ప్యాకేజీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.