CM Chandrababu naidu serious on hidden camera incident: మహిళల భద్రత పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. ప్రతిరోజు కూడా దారుణ ఘటనలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. కోల్ కతా ఘటన మరువక ముందే మహారాష్ట్రలో స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారులపై స్వీపర్ అత్యాచారాని  పాల్పడిన ఘటన బైటపడింది. ప్రతిరోజు కూడా మహిళలు, అమ్మాయిలపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. సుప్రీంకోర్టు సీరియస్ అయిన రాష్ట్రపతి స్పందించిన కూడా దారుణాలు మాత్రం ఆగడంలేదు. ఒక రూపంలో కాకుంటే.. మరోక రూపంలో మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురౌతునే ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఇప్పటికే దేశంలో మహిళలపై దారుణాలను కంట్రోల్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భయ, పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చాయి. అయిన కూడా కామాంధులు మాత్రం తమ ప్రవర్తన మార్చుకొవడంలేదు. ఇంట్లో నుంచి బైటకు వెళ్లిన మహిళలు తిరిగా జాగ్రత్తగా ఇంటికి వచ్చేవరకు కూడా భరోసా లేదని ప్రస్తుతం చోటు చేసుకుంటున్న ఘటనలను బట్టి చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో లేడీస్ బాత్రూమ్ లో కెమెరా ఉన్నట్లు కొంత మంది అమ్మాయిలు గుర్తించారు. వెంటనే వారు తమ తోటి విద్యార్థినులకు చెప్పారు. ఈ క్రమంలో నిన్న రాత్రి నుంచి ఈ ఘటనపై అమ్మాయిలు కాలేజీలో పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో విద్యార్థినుల కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు నేతలు కాలేజీకీ చేరుకున్నారు. ఈ ఘటనపై నిన్నటి నుంచి కూడా నిరసనలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువకుడు విజయ్ ప్రమేయం ఉందని విషయం బైటపడింది.


పోలీసులు రంగంలోకి దిగి.. విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విజయ్.. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోలు, ఫోటోలను తన ల్యాప్ టాప్ లలో డౌన్ లోడ్ చేసుకుని అమ్ముకుంటున్నట్లు కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. నిందితుడు విజయ్ కు మరో యువతి కూడా సహాయం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో బైటడింది.


ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు దాదాపుగా.. 300 ఫోటోలు, వీడియోలు అతను విక్రయించినట్లు కూడా ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ క్రమంలో కాలేజీలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  నిందితులను పట్టుకుని తమకు న్యాయం చేయాలని కూడా విద్యార్థినులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ సీరియస్ అయ్యారు. వెంటనే.. మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. దీని వెనుక ఎవరు ఉన్న వదిలే ప్రసక్తిలేనది కూడా చంద్రబాబు సీరియస్ అయ్యారు. కాలేజీలో ఇలాంటి ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 


గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కళాశాలలో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలనూ గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే నిందితుడు విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


Read more: Kolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..?


నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు, కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తప్పు చేసిన వారిని గుర్తించి వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హమీ ఇచ్చారు.మరోవైపు విద్యార్థులు,రాత్రి నుంచి నిరసలను తెలియజేస్తున్నారు.  సెల్ ఫోన్ టార్చ్ లైట్ పట్టుకుని రాత్రి నుంచి వియ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో పెనుదుమారంగా మారిందని చెప్పుకొవచ్చు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.