AP Municipal Elections Latest News Updates: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ఎలక్షన్ కమిషన్ కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ సర్వోన్నత న్యాయంస్థానం హైకోర్టు కొట్టివేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఏపీ మున్సిపల్ ఎన్నికలు(AP Municipal Elections) మార్చి 10న నిర్వహించనుండగా, మార్చి 14న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఏపీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఏపీలో 12 కార్పొరేషన్లు 75 మున్సిపాలిటీలకు యథావిధిగా ఎన్నికలు నిర్వహించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి.


Also Read: Money Making Tips: ఇప్పుడు Twitter నుండి మీరు డబ్బు సంపాదించవచ్చు, Super Follows Feature వస్తోంది


ఏపీ హైకోర్టు(AP High Court) తీర్పు నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో నిమ్మగడ్డ పర్యటించనున్నారు. ముందుగా ఫిబ్రవరి 27న నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 28న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించనున్నారు.


Also Read: 7th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, తెలంగాణ తరహాలోనే కీలక నిర్ణయం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook