వాహనదారులకు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ ప్లేట్లు తప్పనిసరి! పాత వాహనాలకు కూడా
High Security number Plates are mandatory for All vehicles in AP. తాజాగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది.
High Security number Plates are mandatory for All vehicles in AP: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2014 నుంచి ఏపీలో నూతన వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను రవాణాశాఖ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. పాత వాహనాలకు కూడా హై సెక్యూరిటీ నంబర్ ప్లేటును ఏపీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయంతో పాత వాహనదారుల జేబుకు చిల్లు పడనుంది.
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ల ద్వారా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంకు అదనంగా రూ.500 కోట్ల ఆదాయం వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో 1.5 కోట్ల వాహనాలు ఉండగా.. అందులో సగం వాహనాలకు మాత్రమే హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు ఉన్నట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. మిగతా 75 లక్షల వాహనాలకు ఇంకా హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. వీలైనంత త్వరగా ఈ నంబర్ ప్లేట్లను బిగించుకోవాలని సూచిస్తున్నారు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం... ఇకపై హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు లేని వాహనాలకు రూ. 1000 జరిమానా విధించాలని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రతి వాహనంకు అన్ని పక్కాగా ఉండాలని కూడా హెచ్చరించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా పాత వాహనాలకు హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించేలా నిబంధనలను సవరించాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటికే పెట్రో రూపంలో సామాన్యులపై భారం పడుతుండగా.. అదనంగా ఏ భారం కూడా పడనుంది.
Also Read: Pomegranates For Mens: లైంగిక సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఈ పండ్లను తినండి..!
Also Read: Red Ants Home Remedies: తరచుగా ఇంట్లోకి ఎర్ర చీమలు వస్తున్నాయా.. ఇలా చేయండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook