YS Jagan Visit To Tirumala: తిరుమల లడ్డూ కల్తీ విషయమై నేడు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తిరుమల పర్యటించనున్నారు. రేపు శనివారం ఆయన తిరుమల శ్రీ వేంకటేషుని దర్శనం చేసుకుంటారు. ఈనేపథ్యంలో ఆలయంలోకి వెళ్లాలంటే జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందేనని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ వేంకటేషుని దర్శించుకోవడానికి టీటీడీ డిక్లరేషన్‌ కోరనుందా? ఈ విషయంపై మరింత హై టెన్షన్‌ నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా అన్యమతస్థులు తిరుమల వేంకటేషుని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే. నేడు తిరుమలకు వెళ్లనున్న వైఎస్‌ జగన్‌ అతిథి గృహంలో డిక్లరేషన్‌ ఫామ్‌ ఇవ్వడానికి టీటీడీ అధికారులు సిద్ధమయ్యారని సమాచారం. అయితే, జగన్‌ డిక్లరేషన్‌పై సంతకం పెట్టకపోతే నిబంధనల మేరకు ఆయన్ను దేవాలయంలోకి అనుమతించరు.


జగన్‌ తిరుమల దర్శనం చేసుకోకూడదని హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్‌ పర్యటన కారణంగా పోలీసు యాక్ట్‌ అమల్లోకి వచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందన్న నేపథ్యంలో ఆయన శ్రీవారిని రేపు దర్శించుకోనున్నారు. డిక్లరేషన్‌పై సంతకం పెడితేనే దర్శనానికి పంపిప్తారు. అప్పట్లో ప్రభుత్వం ఈ జీవో ను జారీ చేసింది. అన్యమతుస్థులు శ్రీవారిని దర్శించుకుంటే వేంకటేషునిపై నమ్మకంతోనే దర్శించుకుంటున్నామని డిక్లరేషన్‌పై సంతకం చేస్తేనే అనుమతిస్తారు.


ఇదీ చదవండి: సీఎం రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఫైర్‌.. హైడ్రా పనితీరుపై ఎండగడుతూ సుదీర్ఘ బహిరంగ లేఖ..


సోనియా గాంధీ, అబ్దుల్‌ కలాం కూడా తిరుమలను దర్శించుకున్నప్పుడు వారు కూడా డిక్లరేషన్‌ ఇచ్చారు. ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి కూడా తప్పకుండా డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే. ప్రశాంతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని వైసీపీ క్యాడర్‌ సర్క్యూలర్‌ విడుదల చేశారు. ఈరోజు సాయంత్రం రేణిగుంట చేరుకోనున్నారు. అక్కడి నుంచి తిరుమల చేరుకుంటారు. అతిథి గృహంలో డిక్లరేషన్‌పై ఆయన సంతకం చేయకుంటే తిరుమల దర్శనం చేసుకోలేరు. ఈనేపథ్యంలో తిరుమలలో భారీ బందోబస్తు, జగన్‌కు భద్రకు పెంచానున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.


లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన తర్వాత మొదటిసారి వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనానికి వస్తున్నారు. ఉత్కంఠగా మారిన వైఎస్‌ జగన్‌ తిరుమల దర్శనం ఆయన డిక్లరేషన్‌పై సంతకం చేస్తారా? లేదా? అని టెన్షన్‌ వాతావరణం మారింది. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ను విధానాన్ని వైఎస్‌ జగన్‌ పర్యటనకు ముందు తెరపైకి తీసుకువచ్చింది. తిరుమల దర్శనం తర్వాత బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు వైఎస్‌ జనగ్‌.


ఇదీ చదవండి:  ఈ ఒక్క ఆకు జుట్టు మొత్తాన్ని నల్లగా మారుస్తుంది.. తెల్ల జుట్టుకు చెక్‌ పెడుతుంది..


ఇదిలా ఉండగా గత ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఫ్యాట్‌, చేపనూనె కలిసిందని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ల్యాబ్‌ టెస్ట్‌కు కూడా లడ్డూలను పంపించారు. టెస్ట్‌ రికార్డులు కూడా లడ్డూ కల్తీ జరిగిందని తేలింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.