MLA BALAKRISHNA: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లా పర్యటన టెన్షన్ పుట్టిస్తోంది. పోలీసులకు సవాల్ గా మారింది. తన సొంత నియోజకవర్గం  హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హిందూపురం నియోజకవర్దంలో రెండు వారాల క్రితం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు బాలాజీ, నరసింహమూర్తి గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఇవాళ బాలయ్య వచ్చారు. అయితే గ్రామంలో పరిస్థితిలు ఇంకా పూర్తిగా చల్లబడలేదని.. ఎక్కువ వాహనాలను అనుమతి ఇచ్చేది లేదని పోలీసులు తెలిపారు. బాలయ్య వాహనంతో పాటు మరో మూడు వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తామని చెప్పారు. అయితే అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.


అయితే పోలీసులు మాత్రం మూడు వాహనాలకు మాత్రమే పర్మిషన్ ఇస్తామని తేల్చి చెప్పారు. బాలకృష్ణతో ఉన్నతాధికారులు మాట్లాడారు. గ్రామానికి ఎక్కువ మంది వెళితే గొడవలు జరిగే ప్రమాదం ఉందని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల సూచనకు బాలయ్య అంగీకరించారు. తనతో పాటు మరో మూడు వాహనాల్లో మాత్రం హిందూపురం వెళ్లారు. టీడీపీ నేతలను పరామర్శించిన తర్వాత అక్కడి నుంచే బాలయ్య ఒంగోలు వెళ్లనున్నారు. టీడీపీ మహానాడులో పాల్గొంటారు.


READ ALSO: TDP MAHANADU: పొత్తులపై టీడీపీ మహానాడులో కీలక తీర్మానం? అమలాపురం అల్లర్లపై ప్రత్యేక చర్చ..!


READ ALSO: RAHUL UK TOUR: సమాధానం చెప్పలేక సారీ.. రాహుల్ ను అంతగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఏంటో?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook