Honey Trap: వైజాగ్‌లో కిలేడీ హల్‌చల్.. అబ్బాయిలకు మత్తుమందు ఇచ్చి నగ్న ఫొటోలతో
Women Honey Trap To NRIs At Vizag: ధనవంతుల కొడుకులను వలలో వేసి తన కుట్రలు, కుతంత్రాలతో ఓ మహిళ దారుణాలకు పాల్పడుతున్నారు. పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకున్న మోసం చేస్తున్న ఆమెను అదపులోకి తీసుకున్నారు.
Women Honey Trap: ఆ యువతి నైజం మోసం. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అబ్బాయిలను అడ్డంగా పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్న కిలేడీ విశాఖపట్టణంలో హల్‌చల్ చేస్తోంది. తన వలపు వలతో అబ్బాయిలను బుట్టలో వేసుకుని వారితో కొన్నాళ్లు బాగానే ఉండే ఆమె ఆ తర్వాత తన నిజ స్వరూపం బయటపెట్టి వారిని దోచేసుకుంటోంది. మత్తు మందు ఇచ్చి.. నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీయించుకుని అనంతరం బ్లాక్ మెయిల్‌తో యువకులను వేధింపులకు పాల్పడుతున్న కిలేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా ఇద్దరు ఎన్నారైలతో పాటు వైజాగ్ యువకులను మోసాలకు పాల్పడుతున్న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బారి నుంచి బాధపడుతున్న యువకులకు పోలీసులు విముక్తి ప్రసాదించారు.
Also Read: Deputy CM Theft: డిప్యూటీ సీఎం ఇంట్లో దొంగతనం ఎలా జరిగిందో తెలుసా? దొంగలు వీరే!
విశాఖపట్టణంలోని మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన కొరుప్రోలు జాయ్ జెమిమా మోసాలకు పాల్పడుతోంది. ఆమెను నమ్మి తాను మోసపోయానని భీమిలి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఆమె భరతం పట్టారు. అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ఆమె మోసాల చిట్టా బయటపడింది. విశాఖలోని షీలానగర్‌కు చెందిన ఓ కుటుంబం విదేశాల్లో నివసిస్తోంది. వారి కుమారుడిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జాయ్ జెమియా పరిచయం చేసుకుంది. ఆ యువకుడి ద్వారా షీలానగర్‌లోని వారి అమ్మనాన్నలు ఉంటున్న ఇంటికి వెళ్లింది. కొన్ని రోజుల పాటు పద్ధతిగా నడచుకుంటూ ఆ కుటుంబంతో కలిసిపోయింది.
Also Read: Vijayawada: ఇజ్జత్ తీసిన పోలీసులు.. ఇంద్ర కీలాద్రి వద్ద డ్యూటీలకు వెళ్లి పాడుపని.. వీడియో వైరల్..
ఒక రోజు 'మీ అబ్బాయి స్నేహితురాలిని. పెళ్లి చేసుకుంటా' అంటే యువకుడి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయితే విదేశాల్లో ఉన్న ఆ యువకుడి మాయమాటల్లో ముంచేసి వైజాగ్‌కు రప్పించింది. ఎయిర్‌పోర్టు నుంచి అతడిని తీసుకుని మురళీనగర్‌లోని తన నివాసానికి జెమియా తీసుకెళ్లింది. అనంతరం మత్తు పదార్థం కలిపి జ్యూసులు, డ్రింక్‌లు ఇచ్చి.. పెర్ఫ్యూమ్ స్ప్రేతో అతడిని నిద్రపుచ్చింది. ఆ తర్వాత తన బండారాన్ని బయటపెట్టేసేది. మత్తులో ఉన్న యువకుడితో చనువుగా ఉండేలా ఫొటోలు తీయించుకుంది. అనంతరం ఆ ఫొటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్‌కు పాల్పడేది. విడతల వారీగా పెద్ద మొత్తంలో డబ్బులు అడిగింది.
అనంతరం భీమిలిలో రూ.5 లక్షలు ఖర్చు చేసి అతడితో నిశ్చితార్థం చేసుకుని మళ్లీ బంధించింది. పెళ్లి చేసుకోకపోతే అమెరికా వెళ్లకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. అనంతరం అక్కడి నుంచి ఎలాగోలా బయటపడిన బాధితుడు ఈనెల 4వ తేదీన భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా కొంత మందిని జెమియా మోసం చేసినట్లు సమాచారం. అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ యువకుడు ఆమె వలపు వలలో చిక్కుకున్నారు. అతడిని ఇదే తీరున మోసం చేశారు. చాలా మంది ఆమె బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఒక్కరే కాదు జెమియా వెనుక ఒక ముఠా ఉందని వైజాగ్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ధనవంతులను ఎలా మోసం చేయాలనే దానిపై ప్రత్యేక శిక్షణ పొందారని.. వీటి కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు వివరించారు. ఆమె వెంట ఒక ముఠా ఉందని వెల్లడించారు. వెంటనే వీరి ముఠా ఉందని కమిషనర్ చెప్పారు. ఆమెపై రెండు కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి