AP లో భారీగా తగ్గిన కరోనా కేసులు...
Andhra Pradesh Coronavirus: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు సోమవారం రోజు భారీగా తగ్గాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 43,006 శాంపిల్స్ పరీక్షించగా అందులో కొత్తగా 316 కేసులు నమోదు అయ్యాయి.
AP Covid-19 Updates: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ కేసులు సోమవారం రోజు భారీగా తగ్గాయి. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 43,006 శాంపిల్స్ పరీక్షించగా అందులో కొత్తగా 316 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఏపిలో మొత్తం కేసుల సంఖ్య 8,72,288 కు చేరుకుంది.
Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
కరోనావైరస్ (Coronavirus) వల్ల గత 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7038 కు చేరుకుంది. ప్రస్తుతం 5,626 మంది పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 585 మంది కోలుకుని ఇంటికి తిరిగివెళ్లారు.
ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఇప్పటి వరకు మొత్తం 1,04,53,618 టెస్టులు నిర్వహించారు. దేశంలో అత్యధికంగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల్లో ఏపి కూడా ఉంది. తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 1,22,685 కేసులు నమోదు అయ్యాయి. తరువాత పశ్చిమ గోదావరి జిల్లాలో 92,961 కోవిడ్-19 కేసులు నమోదు కాగా చిత్తూరులో 84,298 మందికి కరోనాసోకింది.
Also Read | Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe