Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

Home Remedies for Cough and Cold | ఇది చలికాలం. అంటే జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం, వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది.

Last Updated : Nov 27, 2020, 10:24 PM IST
    • ఇది చలికాలం. అంటే జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం, వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది.
    • వీటితో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా మొదలు అవ్వవచ్చు.
    • అందుకే ముందు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందితే.. తరువాత మిగితా వాటికి చెక్ పెట్టవచ్చు.
Cough and Cold: జలుబు, దగ్గు వల్ల ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి

Cough and Cold Remedies | ఇది చలికాలం. అంటే జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం, వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది. వీటితో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా మొదలు అవ్వవచ్చు. అందుకే ముందు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందితే.. తరువాత మిగితా వాటికి చెక్ పెట్టవచ్చు.

Also Read : Corona Second Wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి తప్పించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి

ఆరోగ్యంగా (Health) ఉండాలి అంటే జలుబు, దగ్గు రాకుండా ఉండాలి అంటే ఇలా చేసి చూడండి. ఈ చిట్కాలు పాటించి త్వరగా కోలుకోండి

పసుపు-కలపిన పాలు | Milk and turmeric
వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. ఈ చిట్కా పిల్లలకే కాదు.. పెద్దలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు (Cold), దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి.

Also Read | Orange Benefits:  నారింజ పండు.. పోషకాలలో మెండు

అల్లం టీ | Ginger Tea
అల్లం టీ వల్ ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం (Ginger) ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి.

Also Read | Winter Foods For Dry Skin: చలికాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాటించాల్సిన డైట్

తేనె నిమ్మరసం | Lemon and honey
తేనె నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి.

వెల్లుల్లి | Garlic
వెల్లుల్లి వల్ల జలుబు, దగ్గు (Cough) తగ్గుతాయి అని చాలా మందికి తెలియదు. వెల్లుల్లిలో అలిసిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలతో ఉంటుంది. కొన్ని వెల్లుల్లి ముక్కలను బాగా రోస్ట్ చేసి తీసుకోండి. ఇలా రోజుకు ఒకటికి రెండు సార్లు చేయండి. వెల్లుల్లి జలుబును తగ్గిస్తుంది.

Also Read: Aloe Vera Side Effects: అలోవెరా ఎక్కువ తీసుకుంటే సమస్యలు తప్పవు!

తులసి, అల్లం | Basil leaves and Ginger
జలుబు, దగ్గు తగ్గడానికి ఈ తులసి, అల్లం కాంబినేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఈ రెండు కలిపి తీసుకోవడం వల్ల చాలా వేగంగా మీకు మార్పు కనిపిస్తుంది. అల్లం, తులసి ఆకులను నీటిలో కాసేపు మరిగించి తాగండి. పిల్లలకు పెద్దలకూ ఇద్దరికీ చక్కగా పని చేస్తుంది.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News