Huzurnagar Election: ఇటీవలే తనపై నమోదైన ఎన్నికల ఉల్లంఘన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాజాగా తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. 2014 ఎన్నికల సమయంలో హుజుర్ నగర్ లో నమోదైన ఈ కేసును కొట్టివేయాలని ఆయన అందులో కోరారు. దీనిపై ఇరు వాదనలు విన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. తదుపరి విచారణను ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. అప్పటి వరకు ఈ కేసులో ఏపీ సీఎం జగన్ హాజరు కాకుండా మినహాయింపు లభించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏం జరిగిదంటే?


2014 ఎన్నికల సమయంలో హుజుర్ నగర్ నియోజకవర్గ పరిధిలో అనుమతి లేకుండా జగన్ రోడ్ షో నిర్వహించారని ఆరోపణలు వచ్చాయి. ఎలక్షన్ కోడ్ ను ఉల్లఘించారన్న అభియోగాలతో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసును ఇటీవలే నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు ప్రస్తుతం ఏపీ సీఎంగా ఉన్న జగన్ కు నోటీసులు అందులేదని తెలిసింది. ఆ తర్వాత మార్చి 31లోగా జగన్ కు సమన్లు అందజేయాలని కోర్టు ఆదేశించింది. 


దీంతో విచారణకు హాజరయ్యేందుకు కొద్దిగా సమయం కోరుతూ ఏపీ సీఎం జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎన్నికల కోడ్ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఏపీ సీఎం జగన్ కు ఏప్రిల్ 26 వరకు ఈ కేసు విచారణకు హాజరు కాకుండా స్టే ఇచ్చింది. దానికి సంబంధించిన నోటీసులను పోలీసులకు న్యాయస్థానం జారీ చేసింది.  


Also Read: AP Weather: ఏపీలో దంచికొడుతున్న ఎండలు... కర్నూలులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత


Also Read: Ganta Srinivas Rao Resignation: రాజీనామా ఆమోదం కోసం కోర్టుకు.. గంటా శ్రీనివాస రావు రాజకీయ వ్యూహమేంటో ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook