అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఏపీ సర్కార్ నుంచి ఉత్తర్వులు ( IAS officers transfers in AP ) వెలువడ్డాయి. వీరిలో కొంతమంది ఐఏఎస్‌లకు ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు తోడు అదనంగా ఇంకొన్ని కొత్త బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ( Also read : ఆగస్టు 3 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం )


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్ ( IAS K Praveen Kumar ).


రజత్ భార్గవ్‌కు ( IAS Rajat Bhargav ) అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు.


క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్ ( IAS K. Ramgopal ).


ఎస్టీ వెల్ఫేర్ గిరిజనసంక్షేమం సెక్రటరీగా కాంతిలాల్ దండే ( IAS Kantilal Dande ).


సర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థ జైన్‌కు ( IAS Sidhartha Jain ) అదనపు బాధ్యతలు.


మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు (  IAS Kannababu ) అదనపు బాధ్యతలు .


ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి.శ్రీనివాసులు (  IAS G. Srinivasulu ).


సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా ఎస్. దిల్లీరావు ( IAS S Dilli Rao ).


శాప్ ఎండీగా వి.రామారావుకు ( IAS V. Rama Rao ) అదనపు బాధ్యతలు.


దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి.అర్జున్‌ రావు ( IAS P Arjun Rao ).


సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్ ( IAS Chamakuri Sridhar ).


అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి ( IAS A Siri ). 


నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్ ( IAS Swapnil Dinakar ).


కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌ రెడ్డి ( IAS Sunil Kumar Reddy ).


ఫైబర్ నెట్ ఎండీ ఎం. మధుసూదన్‌ రెడ్డి ( IAS M. Madhusudan Reddy ).


ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌ రెడ్డి ( IAS VG Venkat Reddy ).


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..