గత కొన్ని రోజులుగా ఏపీలో మద్యం అక్రమ రవాణా (illegal liquor) దందా కొనసాగుతోంది. అయితే ఆటోలు, బైకులు, చిన్న చిన్న ప్రైవేట్ వాహనాలలో మద్యం తీసుకెళ్తుంటే పోలీసులు, అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో కొందరు అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఏకంగా బస్సులోనే మద్యం అక్రమ రవాణా చేసి ఇద్దరు వ్యక్తులు అడ్డంగా బుక్కయ్యారు. కృష్ణా జిల్లా (Krishna District) పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి మద్యం రవాణాను అడ్డుకున్నారు. RGV సెక్సీ హీరోయిన్ Apsara Rani హాట్ ఫొటోలు వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిల్లాలోని తిరువూరు డిపో బస్సులో ఇద్దరు వ్యక్తులు రెండు బ్యాగుల్లో మద్యం బాటిళ్లతో ప్రయాణిస్తున్నారు. కొందరు స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు బైపాస్‌లో బస్సు నిలిపి తనిఖీ చేపట్టారు. రెండు బ్యాగులలో పది ఫుల్ బాటిళ్లు మద్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ఎస్ఐ సుబ్రహ్మణ్యం గుర్తించారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ధోనీ బర్త్‌ డే విషెస్‌తో హోరెత్తుతున్న ట్విట్టర్


నిందితులు రిజర్వేషన్ ద్వారా బస్సులో ప్రయాణిస్తున్నారా, లేక టికెట్ తీసుకుని ప్రయాణించారా అని ఆరా తీశారు. ఎప్పటినుంచి మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు అనే దానిపై సీసీ ఫుటేజీ‌ను పరిశీలిస్తున్నారు.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..   
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos