న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌తో పాటు దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఢిల్లీ నుంచి వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చెరి, కర్ణాటక, కేరళలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీగా వర్షాలు కురువనున్నాయని.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో 72 గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. భారీ వర్షాలకు తోడు అరేబియా సముద్ర తీరప్రాంతంలో గంటకు 60-70 కి.మీ వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది. 


ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలోనూ సోమవారం రాత్రి నుంచే పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జనగామ, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.