హైదరాబాద్: తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలోని కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే, రాయలసీమలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టంచేసింది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read also : నేడు, రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు


తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వరి పంట చేతికొచ్చే సమయం కావడంతో ఈ అకాల వర్షాలు తమ పంటను దెబ్బతీస్తాయేమోననే ఆందోళన అన్నదాతలను వేధిస్తోంది. ఇప్పటికే ఇదివరకు కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.